Homeసినిమా వార్తలుటైగర్ నాగేశ్వరరావు ట్రైలర్: రవి తేజ మాస్ యాక్షన్.

టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్: రవి తేజ మాస్ యాక్షన్.

Tiger Nageswara Rao Telugu Trailer out now, Ravi Teja and Nupur Sanon and Gayathri Bharadwaj starring Tiger Nageswara Rao trailer public talk. Tiger Nageswara Rao Release Date.

Tiger Nageswara Rao Telugu Trailer out now, Ravi Teja and Nupur Sanon and Gayathri Bharadwaj starring Tiger Nageswara Rao trailer public talk. Tiger Nageswara Rao Release Date.

మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో, యంగ్ ట్యాలెంటెడ్ వంశీ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ లు ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 20న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. 

గత కొద్ది రోజులుగా సినిమాలోని ప్రముఖ పాత్రలందరినీ ఒక్కొక్కటిగా పరిచయం చేసిన మేకర్స్, మోస్ట్ వాంటెడ్ దొంగలకు స్థావరంగా ఉన్న స్టువర్ట్‌పురం వరల్డ్ ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రోరింగ్ ట్రైలర్‌తో వచ్చారు. ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు.

రెండున్నర నిమిషాల ట్రైలర్ లో నాగేశ్వరరావు జీవితంలోని కీలక ఘట్టాలను చూపించారు. టైటిల్ రోల్‌లో రవితేజ యంగ్‌గా, డైనమిక్‌గా, వైల్డ్, బ్రూటల్ గా కనిపించారు. మాసీ రోల్ లో రవితేజ ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా వుంది. ప్రతి నటుడికీ నటించడానికి ఒక స్పేస్, స్కోప్ వుంది. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఫీమేల్ లీడ్ గా కనిపించారు, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, నాజర్, జిషు సేన్‌గుప్తా, హరీష్ పెరడి, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.

టైగర్ నాగేశ్వరరావు యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. దర్శకుడు వంశీ కథ ని చూపించిన విధానం యునిక్ గా వుంది. రవితేజ స్టార్ చరిష్మాకు తగినట్లుగా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ట్రైలర్ సినిమా పై అంచనాలని మరింత పెంచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి మయాంక్ సింఘానియా సహ నిర్మాత.