times top 50 most desirable men list_ vijay deverakonda rare record

టాలీవుడ్ హీరోల్లోకెల్లా అత్యంత స్పీడ్‌గా తనకంటూ సొంతంగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న ఈ హీరో తాజాగా ఓ రేర్ ఫీట్ అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆన్‌లైన్‌ ద్వారా ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా’ పోటీని నిర్వహించింది. దీనిలో భారతీయ చిత్ర సీమకు చెందిన హీరోలతో పాటు క్రికెట్‌ స్టార్‌ల వరకు అవకాశం కల్పించింది. 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారి జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచి వీరిలో మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌కు ఆన్‌లైన్‌ ద్వారా ఓట్లు వేయాలని కోరింది.

ఆన్‌లైన్‌ ద్వారా ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా’ పోటీని నిర్వహించింది టైమ్స్ మీడియా. టాప్ 50 లిస్టు ప్రకటించగా టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మూడో స్థానంలో నిలిచారు. ముఖ్యంగా టాప్ 10 లిస్టు చూస్తే టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ ఒక్కరే అందులో స్థానం సంపాదించారు. బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్‌లు మొదటి, రెండవ స్థానాల్లో చోటు దక్కించుకోగా ఆ తరువాత విజయ్ దేవరకొండనే నిలవడం విశేషం.

ఇటీవల కాలంలో నోటా, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ లాంటి వరుస పరాజయాలను చవిచూసినప్పటికి విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ ఏమాత్రం తగ్గనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ ఫైటర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.