ఫ్యాన్సీ నంబర్‌ కోసం 17 లక్షలు ఖర్చు పెట్టిన యంగ్‌ టైగర్‌

0
178
Tollywood actor Jr NTR pays highest amount ever for car number

JR NTR New Car Number: వాహనాల ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి రుజువైంది. ఇవాళ ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ప్యాన్సీ నెంబర్లకు వేలం పాట నిర్వహించారు. 17 లక్షలు పెట్టి TS 09 FS 9999 నంబరు దక్కించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.

ఈ నెంబర్ కోసం ఎన్టీఆర్ 17 లక్షల భారీ వేలం పలికారు. ఇక ఎన్టీఆర్ కు ఈ నెంబర్ అంటే ఎంత ఇష్టమో అభిమానులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కొన్న కార్లకు ఎక్కువగా 9999 వచ్చేలా ఫాన్సీ నెంబర్లు మీద ఆయన ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మరో రెండు ఫ్యాన్సీ నెంబర్లు గరిష్ట ధరకు అమ్ముడుపోయాయి. రీసెంట్‌గా ఎన్టీఆర్.. అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మోడల్ కారు ఆన్ రోడ్ ధర రూ. 3.43 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా..

Also Read: ఖ‌రీదైన కారు కొనుగోలు చేసిన చ‌ర‌ణ్‌..!

Tollywood actor Jr NTR pays highest amount ever for car number

ఈ కారు కోసమే ఎన్టీఆర్ TS 09 FS 9999 నెంబర్ ను భారీ వేలంతో దక్కించుకున్నారు. ఇక ఎన్టీఆర్ కు 9 అనే నెంబర్ ఆయనకు ఇష్టమైన నెంబర్.. కారుతో పాటు ట్విటర్‌ ఖాతాలో కూడా ఎన్టీఆర్‌ @tarak9999 కనిపిస్తుంది.

Also Read: RC15: 10 CR Special Set For Ram Charan and Shankar Film 

 

Previous articleనెట్ ఫ్లిక్స్ కోసం వెంకీ రానా వెబ్ సిరీస్..!
Next articleNetflix Bags Shyam Singha Roy Digital Rights for Huge Price