‘చావు కబురు చల్లగా’ టీజర్: కార్తికేయ మాసీ లుక్

0
535
Tollywood actor karthikeya Lavanya Tripathi chaavu kaburu challaga telugu movie first Glimpse

 karthikeya chaavu kaburu challaga: Rx 100′ సినిమాతో యూత్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”చావు కబురు చల్లగా”. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. లక్కీ బ్యూటీ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. కార్తికేయ ఎలాంటి పాత్ర చేసినా అందులో ఎదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. ఫామ్ లో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్లు సినిమాలు చేయకుండా కేవలం తనకు సెట్టయ్యే మంచి కంటెంట్ ఉన్న కథలని సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

ఈ చిత్రంలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 21) కథానాయకుడు కార్తికేయ పుట్టినరోజు కానుకగా ‘చావు కబురు చల్లగా’ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కార్తికేయ మరొక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక విడుదలైన గ్లింప్స్ అంచనాల డోస్ కూడా పెంచింది.

ఈ టీజర్ లో ఫోన్ కాల్ తో నిద్ర లేచిన హీరోకి అవతలి వైపు నుంచి ‘మా బంధువొకరు చనిపోయారు.. స్మశానానికి తీసుకెళ్లాలి.. మేం దేవుడి బిడ్డలం. మరి మీరు మా వాళ్ళను తీసుకెళ్తారా?’ అని అడుగగా.. ‘డబ్బులిత్తే ఎవరి బిడ్డలనన్నా తీసుకెళ్లామ్.. అడ్రెస్ చెప్పండి’ అని కార్తికేయ సమాధానం చెప్తాడు. కార్తికేయ త‌ల్లిగా సీనియ‌ర్ యాక్ట‌ర్ ఆమ‌ని న‌టిస్తోంది. అంబులెన్స్ డ్రైవ‌ర్ (అంతిమ యాత్ర వాహ‌నం) గా కార్తికేయ రోల్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని ఫ‌స్ట్ గ్లింప్స్ చూస్తే అర్థ‌మవుతోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే మరో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.