హాస్పిటల్ నుంచి రాజశేఖర్ డిశ్చార్జ్..!

0
423
actor rajashekar discharged from hospital today

Rajasekhar Discharged: సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నెల రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రాజశేఖర్‌తోపాటు ఆయన భార్య జీవిత, కుమార్తెలు శివాని, శివాత్మిక హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో చేరారు. కరోనా మహమ్మారి నుంచి జీవిత, శివాత్మిక, శివాని కోలుకున్నా రాజశేఖర్‌ ఆరోగ్యం మాత్రం ఆందోళనకరంగా మారింది. ఆయన ఒకానొక సమయంలో ఆయన తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నెల రోజులుగా సిటీ న్యూరో ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రాజశేఖర్ ఎట్టకేలకు డిశ్చార్జ్ అయ్యారు.

అయితే, గత కొద్ది రోజులుగా రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తోంది. ఆయన ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో రాజశేఖర్ కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆయన్ని సోమవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రాజశేఖర్ డిశ్చార్జ్ అయిన విషయాన్ని జీవిత మీడియాకు తెలియజేశారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. నేడు ఆసుపత్రి వైధ్యులకు మరియు స్టాఫ్ అందరికి రాజశేఖర్ దంపతులు మరియు శివాని మరియు శివాత్మికలు కృతజ్ఞతలు తెలియజేశారు.

డాక్టర్ కృష్ణ తన బృందంతో కలిసి రాజశేఖర్‌కు మెరుగైన వైద్య సేవలు అందించారని.. తమను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని జీవిత భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై ఈ హాస్పిటల్ సిబ్బందిని మిస్ అవుతానని రాజశేఖర్ తనతో అన్నట్టు చెప్పారు. మరి కొన్ని రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైధ్యులు రాజశేఖర్ కు సూచించారట. అలాగే, రాజశేఖర్ కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ జీవిత ధన్యవాదాలు తెలిపారు. అందరి ఆశీర్వాదాలతోనే ఆయన కోలుకున్నారని చెప్పారు.

Previous articleశర్వానంద్ ‘శ్రీకారం’: ‘భలేగుంది బాలా’ మిక్కీ మాస్ బీట్
Next articleBB3 అప్‌డేట్.. ఎట్టకేలకు బాలయ్య హీరోయిన్ ఫిక్స్..!