tollywood actress Actress Avika Gor share her love Balika Vadhu photos

Avika Gor: ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న అవికా గౌర్ తెలుగులో హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’తోనే మంచి గుర్తింపు సాధించి ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బరువు పెరగడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొంతకాలం బ్రేక్ తీసుకుని ‘రాజుగారి గది 3’తో రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడు లైఫ్ లో సెటిల్ అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది అవికాగోర్.

ప్రేమ జీవితం ఒక అందమైన అనుభవంలా ఉందంటూ చెప్పుకొస్తూ ప్రియుడితో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆమె ప్రియుడి పేరు మిలింద్ చద్వానీ. ‘నా ప్రార్థనలకి సమాధానం దొరికింది. నాకు నిజమైన ప్రేమ దొరికింది. మనకు నచ్చిన లక్షణాలున్న వ్యక్తి దొరకడం కష్టమని అనుకుంటాం గానీ నాకు మాత్రం అలాంటి వ్యక్తే దొరికాడు. ఇదంతా ఒక కలలా ఉంది. నేను ఎలాంటి భావనకి గురవుతున్నానో అందరూ అదే అనుభూతిని పొందాలని ఆశిస్తున్నా. ఈ బంధం నా జీవితంలో కీలక పాత్ర పోషించబోతోంది’.. అంటూ అవికా తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసుకుంది. హీరోయిన్ గా పెద్దగా ఆఫర్లు రాని సమయంలో ఈమె తన ప్రియుడి ని పరిచయం చేయడం.. ప్రేమ విషయాన్ని వెళ్లడించడంతో త్వరలోనే అవికా పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.