Tollywood Actress Kajal Aggarwal Confirms Marriage With Gautam Kitchlu

Kajal Aggarwal’s Fiance Gautam Kitchlu:  తన పెళ్లిపై వస్తున్న వార్తలపై నటి కాజల్ అగర్వాల్ కన్ఫార్మ్ చేశారు. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30వ తేదీన పెళ్లాడనున్నట్లు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పింది. తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అందరికీ కాజల్ ధన్యవాదాలు తెలిపింది.

ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం. ఇప్పుడు కాజలే తన పెళ్లి తేదీని స్వయంగా ప్రకటించడం విశేషం. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో ఆచార్య, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది. మంచు విష్ణుతో మోసగాళ్లు సినిమాతో పాటు, బాలీవుడ్‌లో జాన్ అబ్రహాంతోనూ నటిస్తోంది.

who Is Gautam Kitchlu, Kajal Aggarwal's Fiance

ఇక, కాజల్ కాబోయే భర్త గౌతమ్ కిచ్లు విషయానికి వస్తే.. ఆయన ఒక ఇంటీరియర్ డిజైనర్, టెక్ ఎక్స్‌పర్ట్. గౌతమ్ ప్రస్తుతం ముంబై కేంద్రంగా ‘డిసెర్న్ లివింగ్’ (Discern Living) అనే ఈ-కామర్స్ కంపెనీని నడుపుతున్నారు. ఈ కంపెనీ ద్వారా వినియోగదారులకు ఇంటీరియర్ డిజైన్, హోమ్ డెకరేషన్ సర్వీసులను అందిస్తున్నారు. హౌస్ డిజైనింగ్, రూమ్ డిజైనింగ్‌తో పాటు డిజైనర్ ఫర్నీచర్, డెకార్ ఐటమ్స్, పెయింటింగ్స్, ఇతర హౌస్‌హోల్డ్ ఐటమ్స్‌ను గౌతమ్ కంపెనీ విక్రయిస్తోంది.

who Is Gautam Kitchlu, Kajal Aggarwal's Fiance

ఆయన మంచి రన్నర్. ఇక గౌతమ్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే.. ఆయన ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చదివారు. మసాచుసెట్స్‌ (యూఎస్)లోని టుఫ్ట్స్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఇదిలా ఉంటే, కాజల్ తన పెళ్లి వార్తను ప్రకటించగానే గౌతమ్ కిచ్లుతో ఆమె క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో గౌతమ్, కాజల్ చాలా క్లోజ్‌గా కనిపిస్తున్నారు.