tollywood actress keerthy suresh latest look shocking and goes viral

Tollywood Actress Keerthy Suresh: మహానటి సినిమాతో భారీ క్రేజ్ దక్కించుకున్న కీర్తి సురేష్‌ తెలుగులో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం పెంగ్విన్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం గుడ్ ల‌క్ స‌ఖి, రంగ్ దే, అన్నాతై, స‌ర్కారు వారి పాట‌ వంటి చిత్రాల‌లో న‌టిస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన లుక్ షాక్‌కు గురిచేస్తోంది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్ రీసెంట్‌గా ఓ వీడియో షేర్ చేసింది. కాఫీ తనకు కొత్త ఉత్సాహం ఇస్తుందని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కచ్చితంగా కప్పు కాఫీ తాగుతానని తెలిపింది. అయితే ఎప్పుడూ బొద్దుగా కనిపించే కీర్తిసురేష్ ఇప్పుడు సన్నబడిపోయింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోను చూసిన ఫ్యాన్స్ షాకయ్యారు. ఒంటిమీద కేజీ కండ కూడా లేనట్లుగా మరీ సన్నగా కనిపిస్తోంది. ఎప్పుడూ బొద్దుగా ముద్దుగా కనిపించే తమ హీరోయిన్ ఇలా సన్నబడి లుక్ మొత్తం చెడగొట్టుకుందని పీలవుతున్నారు.