ఈడీ విచారణకు హాజరైన నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌..!

0
28
Tollywood Actress Rakul Preet Singh attends Investigation at ED Office

Tollywood Drug Case: టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రముఖులను సుదీర్ఘంగా విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా నేడు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

అయితే నిజానికి ఈనెల 6న విచారణకు హాజరుకావాలని రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తేదీని మార్చాలంటూ ఈడీ అధికారులకు రకుల్‌ లేఖరాశారు. ఆ లేఖను పరిశీలించిన అధికారులు.. తొలుత ఆమె అభ్యర్థనను తిరస్కరించినా.. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రశ్నించనున్నారు.

మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం. డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

6 గంట‌ల పాటు విచార‌ణ‌..!

శుక్రవారం ఉదయం నుంచి దాదాపు 6గంటల పాటు ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రకుల్‌ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు.. లావాదేవీలపై ప్రశ్నించినట్టు సమాచారం. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

 

Previous articleబుల్లితెరపై ఎన్టీఆర్ మ్యాజిక్..!
Next articleరివ్యూ: డియర్‌ మేఘ