రోజా లవ్ స్టోరీ .. 20 ఏళ్ల క్రిందటి ఆమె లవ్ స్టోరీ రివీల్

0
221
Tollywood Actress Roja- Selvamani Love Story Goes Viral On Social Media

Roja Love Story: ఆ నాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన రోజా సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు రాజకీయవేత్తగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అయితే తమిళ దర్శకుడు సెల్వమణిని పెళ్లాడిన రోజా.. తాజాగా జబర్దస్త్ లో రోనా తన లవ్ స్టోరీని రివీల్ చేశారు. రోజా సెల్వమణిల ప్రేమ పై బుల్లెట్ భాస్కర్ టీం స్కిట్ చేస్తున్న సమయంలో రోజా ఇలా మా ప్రేమ కథ ఉండదు.అని చెపుకువచ్చారు.

రోజాది ప్రేమ వివాహం అని ఇప్పటికీ కొంతమందికే తెలుసు. అయితే ఇప్పుడు అసలు విషయాలు స్వయంగా రోజానే రివీల్ చేయడంతో 20 ఏళ్ల క్రిందటి ఆమె లవ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సెల్వమణి డైరెక్ట్ గా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పలేదు. నన్ను ప్రేమించిన ఆయన మొదట వెళ్లి మా ఇంట్లో వారికి చెప్పాడు. వారిని ఒప్పించిన తర్వాత వచ్చి నాకు ఐలవ్ యూ చెప్పాడు.

నేను సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్ లో ఉన్నాను. అప్పుడు నా వద్దకు వచ్చి ఐలవ్ యూ మన పెళ్లికి మీ ఇంట్లో వారు ఒప్పుకున్నారు అంటూ చెప్పారు అంటూ రోజా తన పాత రోజుల ప్రేమ కథను గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత పదేళ్లకు.. అనగా 1992లో ప్రేమికులుగా మారి 2002లో రోజా- సెల్వమణి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. ఓ అమ్మాయి, అబ్బాయి. రోజా భర్త అయిన సెల్వమణి తమిళ దర్శకుల సంఘంలో కీలక సభ్యుడిగా ఉండటమే కాకుండా సౌత్ సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.