Tollywood Actress Sai Pallavi shocking comments
Tollywood Actress Sai Pallavi shocking comments

తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే సాయి పల్లవి ఆలోచనలు, ఆచరణలు కాస్త భిన్నంగా ఉంటాయనే చెప్పాలి. టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ అక్కడ ఆమె నటించిన చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో సరైన అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ నాగ చైతన్య సినిమాలోనూ అలాగే రానా ‘విరాట పర్వం’ సినిమాలోనూ నటిస్తుంది.

అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగులో కూడా సాయి పల్లవి ఇమేజ్‌ను బాగానే దెబ్బ తీసాయి. అయితే సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అమ్మడు క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ సినిమాకు దాదాపు కోటికి పైగానే తీసుకుంటుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే గ్లామర్ షో విషయంలో మరోసారి ఓపెన్ అయిపోయింది ఈ భామ.

ఆ విషయాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.. తనకు లిప్ లాక్ సీన్స్ అయినా.. హాట్ సన్నివేశాల్లో నటించడం అన్నా అస్సలు పడదంటుంది. స్క్రిప్ట్ డిమాండ్ చేసినా కూడా తను మాత్రం అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉంటానని ఇది వరకే చెప్పింది.. ఇప్పుడు చెబుతుంది పల్లవి. కేవలం అలాంటి హాట్ సీన్స్ ఉన్నాయనే కారణంతోనే ఈ మధ్య సరిలేరు నీకెవ్వరుతో పాటు డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలను వదిలేసుకుంది ఈ ఫిదా బ్యూటీ.

జీవితంలో ఏదైనా అనుకున్న విషయం జరగకపోతే.నిరాశ పడడం సహజమని.. అయితే అలాంటి వాటిని తాను వేరే కోణంలో చూస్తానని చెప్పింది. ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని. అంతేకానీ ఆశించింది జరగలేదని నిరుత్సాహపడకూడదని చెప్పింది. ఏం జరిగినా మన మంచికే అని భావించడం తనకు చదువుకునే రోజుల్లో నుండే అలవాటు అయిందని చెప్పింది.

స్టార్స్‌కు కొంత క్రేజ్ వస్తే యాడ్స్ రావడం కామన్. అలాగే సాయి పల్లవికి కూడా కొన్ని యాడ్స్ చేయాలంటూ వచ్చాయి కొన్ని కంపెనీలు. కోట్లు ఇస్తామని చెప్పినా కూడా అందులో నటించడానికి సాయి పల్లవి నో చెప్పింది. ఓ ఫేస్ క్రీమ్ సంస్థ ఏకంగా 2 కోట్లు ఆఫర్ చేస్తే కూడా చేయనని చెప్పింది ఈ భామ. అంతేకాదు.. ఆ మధ్య పడిపడి లేచే మనసు నిర్మాత పారితోషికంలో 40 లక్షలు బాకీ ఉండటంతో సినిమా విడుదలైన తర్వాత ఇవ్వాలని చూసాడు. అయితే ఫ్లాప్ కావడంతో వద్దని చెప్పింది ఈ బ్యూటీ. అలాంటి మంచి మనసు సాయి పల్లవి సొంతం.

ఇక తనకు డబ్బు కాదు.. ఆత్మసంతృప్తి ముఖ్యమని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఎక్కువ సంపాదిస్తే ఏమైనా ఎక్కువ తింటానా.. ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేది మూడు చపాతీలే.. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ తింటామా ఏంటి అంటుంది ఈ బ్యూటీ. సంతోషంగా, ఆత్మసంతృప్తితో బతికితే చాలు.. తన విలువలు చంపుకుని పని చేయడం నాకు నచ్చదని సంచలన కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అందుకే యాడ్స్ ఒప్పుకోలేదని చెప్పింది. అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.