Tollywood Actress tamanna tests covid-19 positive

Corona: Tamannaah: మహమ్మారీ విలయం కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులపై ఆందోళన నెలకొంది. కోట్లాది మంది జనాన్ని వణికిస్తున్న కరోనా సినీ సెలబ్రిటీలకు సైతం ఓ శాపంలా మారింది. ఇప్పటికే ఎంతోమంది సినీ తారలు కరోనా బారిన పడ్డారు. ఇందులో కొందరు కోలుకోగా.. ఇంకొందరు ఆ మహమ్మారి దాడికి బలైపోవడం సినీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

తాజాగా అందాల కథానాయిక తమన్నాకు కరోనా సోకిందని ప్రచారమవుతోంది. అధిక జ్వరంతో తమన్నా బాధపడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారని సమాచారం. ల్యాబ్ టెస్టుల అనంతరం పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తమన్నాకు కరోనా పాజిటివ్ అని తెలిసినప్పటికీ ఇన్‌ఫెక్షన్ ఎంత ఉండనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.