Tollywood actresses who dominates actors,Samantha,amala paul, Anushka shetty
Tollywood actresses who dominates actors,Samantha,amala paul, Anushka shetty

సినిమాల్లో మేల్ డామినేషన్ అనేది మెల్లగా తగ్గుతూ వస్తుంది.ఇప్పుడు సరయిన కంటెంట్,తమకు నచ్చిన కథ ఉంటే హీరోయిన్స్ సినిమాలు చేసేస్తున్నారు.హీరో అవసరం లేకుండానే భారీ హిట్స్ కొట్టేస్తున్నారు.రీసెంట్ గా వచ్చిన ఓ బేబీ తో ఈ విషయం మరొక సారి ప్రూవ్ చేసింది సమంత.గతంలోనే U టర్న్ సినిమాని స్వయంగా ఇనీషియేటివ్ తీసుకుని తెలుగులో రీమేక్ చేసింది.ఆ సినిమా కూడా బాగానే ఆడిన ఓ బేబీ మాత్రం కమర్షియల్ గా కూడా బ్లాక్ బస్టర్ స్టేటస్ దక్కించుకుంది..సమంత కి ఇక్కడ లేడి సూపర్ స్టార్ అనే బిరుదు ఇచ్చింది.

తమిళ్ లో మాత్రం లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు కైవసం చేసుకుంది నయనతార.ఆమె ఒక సినిమా ఒప్పుకుని నటిస్తుంది అంటే చాలు ఆ సినిమాకి ఆటోమేటిక్ గా బజ్ క్రియేట్ అయిపోతుంది.రొటీన్ అండ్ కమర్షియల్ సినిమాల్లో,హీరోల పక్కన ఆడిపాడడానికి ఆమె పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు.ఆమె చేసిన సినిమా బడ్జెట్ ఎంతయినా సోలో గా రికవర్ చేస్తుంది.లాభాలు అందిస్తుంది.ఆమెని ఇంప్రెస్ చేసేలా స్టోరీ రాసుకుంటే చాలు నిర్మాతలు క్యూ లో ఉన్నారు.ఇప్పుడు ఆమె అగ్ర హీరోలు అందుకునే రెమ్యునరేషన్ లో 70 శాతం వరకు అందుకుంటుంది.అనుష్క కూడా ఎప్పుడో అరుంధతి సినిమాతోనే తన బాక్స్ ఆఫీస్ స్టామినా ప్రూవ్ చేసి చూపించింది.ఆ తరువాత ఆమె చేసిన హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు కొన్ని ఫెయిల్ అయినా భాగమతి తో అనుష్క రేంజ్ ఏంటి అనేది తెలిసొచ్చింది.ఏకంగా 35 కోట్ల బడ్జెట్ ని సైతం రికవర్ చేసి,సినిమా కొనుక్కున్న వాళ్లకు లాభాలు కూడా అందించింది.

ఇప్పుడు అనుష్క చేస్తున్న సైలెన్స్ లో కూడా ఆమెదే ఇంపార్టెంట్ రోల్.తెలుగులో గ్లామర్ సినిమాలతో తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తాప్సి సైతం రూట్ మార్చి తన పెర్ఫార్మెన్స్ ఎలివేట్ చేసే పాత్రలు ఎంచుకుంటుంది.ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో భారీ మార్కెట్ ఉన్న హీరోయిన్ తాప్సినే.20 కోట్ల లోపు బడ్జెట్ తో తీసిన సినిమాలతో 100 కోట్లు పైగా రాబట్టడం ఆమెకి అలవాటుగా మారిపోయింది.పైగా ఆమె హిందీ లో చేసిన సినిమాలు సౌత్ లో రీమేక్ చేసే స్టేజ్ కి వెళ్ళింది.బాషా ఏదైనా తాప్సి నటిస్తే హిట్ ఖాయం అనే టాక్ వచ్చేసింది.కీర్తి సురేష్ కూడా మహానటి సినిమాతో అందరూ ఆశ్చర్యపోయే ఫలితం అందుకుంది.అందుకే ఆమె మెయిన్ లీడ్ గా ఒక భారీ సినిమా నిర్మిస్తున్నారు.దిల్ రాజు కూడా ఆ సినిమాలో భాగస్వామిగా మారడానికి ఒప్పుకున్నాడు అంటే ఆ సినిమా కంటెంట్ ఎంత ప్రామిసింగ్ గా ఉందో అర్ధమవుతుంది.

అలాగే అమలా పాల్,నిత్యా మీనన్,కాజల్,ప్రియమణి,అంజలి,సాయి పల్లవి…ఇలా ఎంతోమంది హీరోయిన్స్ సోలోగానే భారీ హిట్స్ దక్కించుకుంటూ హీరోలకే సవాల్ విసురుతున్నారు.పైగా వాళ్ళు నటించిన సినిమాల బడ్జెట్ తక్కువ కావడం,భారీ లాభాలు వస్తుండడంతో నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్స్ సైతం లో రిస్క్ ప్రాజెక్ట్స్ అయిన ఆ సినిమాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఏది ఏమైనా ఇప్పడు హీరోయిన్స్ మాత్రం ఒక రేంజ్ లో హిట్స్ అందుకుంటున్నారు.