మహేశ్ సరిలేరు.. ను పట్టించుకోని సెలబ్రిటీలు.. ఎందుకు??

0
2628
tollywood celebrities not interested Mahesh babu Sarileru Neekevvaru movie
tollywood celebrities not interested Mahesh babu Sarileru Neekevvaru movie

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతికి ప్రకటించిన నాలుగు సినిమాలు ధియేటర్లలోకి వచ్చి సందడి చేస్తున్నాయి. సంక్రాంతి అనే కాకుండా ఏ సినిమా ఎప్పుడు విడుదలై హిట్ అయినా టాప్ హీరోలు, దర్శకులు మెచ్చుకోవటం వారికి ఫోన్లు చేసి అభినందించటం జరుగుతోంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అభినందనలు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల్లో చెప్పటం జరుగుతోంది. ఈ సంక్రాంతికి పోటీపడ్డారు మహేశ్ – అల్లు అర్జున్. అయితే బన్నీ అల.. వైకుంఠపురములో సినిమాకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెస్పాన్స్ మహేశ్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు రావడంలేదని తెలుస్తోంది.

ఈ చిత్రం జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా విడుదలై దుమ్ము లేపుతోంది. ఈ సినిమా మహేశ్ కెరీర్‌లో మాస్ సినిమాగా నిలిచిందని వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే థ్యాంక్స్ మీట్‌తో పాటు సక్సెస్ ఇంటర్వ్యూలు సైతం చేసింది చిత్రబృందం. మరోవైపు ఇప్పటికే కలెక్షన్ల వర్షం గట్టిగానే కురిసింది.. పండగ పూర్తయ్యే సరికి మరింత వసూళ్లు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే పలువురు ఈ సినిమా చూసి తమ అభిప్రాయాలను వెల్లడించారు. మరోవైపు వీరాభిమానులు సైతం తమదైన శైలిలో నెట్టింట్లో రివ్యూ రాసుకొచ్చారు.

అయితే.. సినీ సెలబ్రిటీలు మాత్రం ఈ మూవీని పెద్దగా చూడలేదు.. అంతేకాదు.. సినిమా చూసినప్పటికీ స్పందించకపోవడంతో అసలు సినిమా వాళ్లకు నచ్చిందా..? సినిమా బాగా నచ్చడంతో ఏం కామెంట్స్ చేయాలో తెలియక మిన్నకుండిపోయారా..? అనేది మాత్రం తెలియరాలేదు.బన్నీకి విసెష్ చెప్తూ సినిమా విడుదలైన రెండో రోజే రామ్ చరణ్ , ఎన్టీఆర్ , పవన్ కల్యాణ్ నుంచి సోషల్ మీడియాలో మెసేజెస్ వెళ్లిపోయాయి. బన్నీ – ఎన్టీఆర్ బాండింగ్ వెరీ స్పెషల్ గా కనిపించింది. బావా.. థ్యాంక్స్, కలుద్దాం అంటూ వారి సంబాషణ ఆకట్టుకుంది. పవన్ పంపి విసెష్ తో బన్నీ పొంగిపోయి మీ అభినందనలకు ధన్యవాదలు అంటూ రెస్పాన్స్ ఇచ్చాడు. ఇక చరణ్ తో రిలేషనే ఉంది. దర్శకుడు సుకుమార్ కూడా బన్నీ అల.. ను మెచ్చుకుంటూ వారిద్దరూ దిగిన ఫోటోను యాడ్ చేసి మెసేజ్ చేశాడు. కానీ.. వీళ్లలో ఎవరూ కూడా మహేశ్ సరిలేరు నీకెవ్వరు గురించి ఒక్క ట్వీట్ గానీ మెసేజ్ గానీ చేయలేదు. మహేశ్ తో రామ్ చరణ్ కు, ఎన్టీఆర్ మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

మరి సరిలేరుపై ఎందుకు స్పందించట్లేదన్నది మాత్రం ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. అబౌ యావరేజ్ కావటం పెద్దగా నచ్చకపోవటం వల్లే ఎవరూ రెస్పాండ్ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో లోగుట్టు ఏమిటో ఎవరికీ అర్ధం కావట్లేదు. మొత్తానికి సంక్రాంతి సినిమాలన్నీ ధియేటర్లలో సందడి చేస్తున్నాయి.

 

Previous article‘ఎంత మంచివాడవురా’ మూవీ రివ్యూ
Next articleశేఖర్ మాస్టర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సూపర్ స్టార్…