టాలీవుడ్ డ్రగ్స్ కేస… ఈడీ ముందుకు రవితేజ

0
70
Tollywood drugs case Hero Ravi Teja appears before ED in Hyderabad

Ravi Teja Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు సినీ నటులు పూరి జగన్నాథ్, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానాలను విచారించిన ఈడీ అధికారులు ఇవాళ మాస్ మహారాజా రవితేజపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు.

దాదాపు నాలుగు గంటలుగా హీరో రవితేజ, అతడి డ్రైవర్ శ్రీనివాస్‌లను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో డ్రగ్స్ కేసులో నిందితుడైన జి షాన్ అలీ ఖాన్‌ను పిలిపించిన ఈడీ అతడిపైనా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

2017లో మొదటగా జిషాన్ అలీ ఖాన్‌ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో టాలీవుడ్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో ఇవాల్టి విచారణలో కీలక ఆధారాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది.

Tollywood drugs case Hero Ravi Teja appears before ED in Hyderabad

డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రవితేజను విచారించనుంది.