Tollywood Hat Trick Hit With Ismart Shankar Oh Baby and NVNN
Tollywood Hat Trick Hit With Ismart Shankar Oh Baby and NVNN

[INSERT_ELEMENTOR id=”3574″]

టాలీవుడ్ కి కీలకమయిన సీజన్స్ లో సమ్మర్ కూడా ఒకటి.అయితే ఈ సంవత్సరం మాత్రం సమ్మర్ పెద్దగా అనుకూలించలేదు.మహర్షి మినహా పెద్దగా సందడి చేసిన సినిమాలు ఏవీ లేవు.కానీ విచిత్రంగా సమ్మర్ తరువాత టాలీవుడ్ కి హిట్స్ పడ్డాయి.డెడ్ సీజన్ అయిన జులై మాత్రం టాలీవుడ్ కి హ్యాట్రిక్ హిట్స్ అందించింది.ఓ బేబీ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే,నిను వీడని నీడను నేనే కంటెంట్ వీక్ గా ఉన్నా కూడా కమర్షియల్ గా నిలబడింది.ఇక ఇస్మార్ట్ శంకర్ అయితే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది.ఈ మూడు సినిమాల జోనర్స్ వేరయినా కామన్ పాయింట్ మాత్రం ఒకటి ఉంది.అదేంటంటే ఈ మూడు సినిమాలు కూడా డు ఆర్ డై సిట్యుయేషన్ లో ఉండి తీసినవే.

ఓ బేబీ అనేది ఆ సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి కి కీలకమయిన సినిమా.అలా మొదలైంది తరువాత మళ్ళీ హిట్ లేక ఖాళీగా ఉన్న ఆమెకి సమంత ఇప్పించిన ఛాన్స్ అది.అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాతో సోలో హిట్ కొట్టి తన రేంజ్ ప్రూవ్ చేసుకోవాలని సమంత కూడ చాలా కష్టపడి ఈ సినిమా చేసింది.అనుకున్నట్టే ఈ సినిమా ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయిపోయింది.అంతే కాదు ఓవర్సీస్ లో ఏకంగా వన్ మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.ఇది మామూలు ఫీట్ కాదు.ఓ బేబీ తో సమంత అండ్ నందిని రెడ్డి ఇద్దరూ కూడా జాక్ పాట్ కొట్టినట్టయింది.నిను వీడని నీడను నేనే.ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు మెప్పించినా సెకండ్ హాఫ్ సో సో గా ఉండి అన్న టాక్ వినిపించింది.అయితే ఈ సినిమా హీరో సిట్యుయేషన్ ఎంత దారుణంగా ఉందో తెలిసిందే.హిట్ అనే మాట విని చాలా సంవత్సరాలే అయ్యింది.పైగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నాడు.టాక్ చూస్తే డివైడ్ గా ఉంది పాపం అనుకున్నారు అంతా.కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఉన్న ట్విస్టులు,హారర్ ఎలిమెంట్ లోని కొత్తదనం,వెన్నెల కిషోర్ ప్రెజెన్స్ లాంటివి కలిసొచ్చి కమర్షియల్ గా సేఫ్ అయిపోయింది.దీంతో ఈ సినిమా హీరో కమ్ ప్రొడ్యూసర్ అయిన సందీప్ కిషన్ ఎట్టకేలకు హిట్ వచ్చింది అన్న ఆనందంలో ఉన్నాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

స్మార్ట్ శంకర్…ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు డైరెక్టర్ పూరి జగన్నాథ్,హీరో రామ్…ఈ ఇద్దరి సిట్యుయేషన్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.సినిమా రిలీజ్ అయ్యాక కూడా టాక్ జస్ట్ బావుంది అనేలా వచ్చింది.కానీ టాలీవుడ్ లో సరయిన మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది.దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా చెలరేగిపోయింది.మాస్ పవర్ ని తెలియజేస్తూ రామ్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి.17 కోట్లకు ఈ సినిమా హక్కులు అమ్మితే కేవలం నాలుగురోజుల్లో 22 కోట్ల 33 లక్షల షేర్ వచ్చింది.ఓవర్సీస్ లో తక్కువే కలెక్ట్ చేసినా అక్కడ కూడా హక్కులు కొన్న రేటు కవర్ అయిపోయింది.ఈ సినిమాతో పూరి కి సినిమాల పరంగా రీబర్త్ వచ్చినట్టే.

ఇలా ఈ మూడు సినిమాల సక్సెస్ తో టాలీవుడ్ కి కొత్త ఎనర్జీ వచ్చింది.ముఖ్యంగా ఆయా సినిమాల నిర్మాతలకు,డైరెక్టర్స్ కి,యాక్టర్స్ కి అవసరమయిన,అతి కీలకమయిన సక్సెస్ దక్కింది.వాళ్ళ తలరాతలు మార్చింది జులై నెల.ఈ నెలలో ఆఖరివారం రిలీజ్ కాబోతున్న డియర్ కామ్రేడ్ కూడా ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ కి,ఆ సినిమా డైరెక్టర్ భరత్ కమ్మ కి కూడా చాలా క్రూషియల్.ట్రేడ్ కూడా ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.సో,అది కూడా హిట్ అయితే జులై నెల టాలీవుడ్ కి మెమరబుల్ మంత్ గా నిలుస్తుంది.నెక్స్ట్ ఇయర్ నుండి జులై లో కూడా సినిమాలు రిలీజ్ చెయ్యడానికి పోటీ ఏర్పడుతుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]