Tollywood Hero Rajasekhar Met With Car Accident
Tollywood Hero Rajasekhar Met With Car Accident

హీరో రాజశేఖర్ భారీ ప్రమాదం నుంచి సురక్షితం గా బయట పడ్డారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో అప్పా జంక్షన్ వద్ద జరిగిన ఈ ప్రమాద సరళి.. ఆయన ఎస్.యు.వి కార్ ముందు భాగం నుజ్జు నుజ్జు అయిన తీరు చూస్తుంటే .. ఇది చాల పెద్ద ప్రమాదమేనని అర్థమవుతోంది. తన తల్లిని కోల్పోయిన డిప్రెషన్ నుండి ఇంకా యాక్టర్ రాజశేఖర్ బయటపడలేదో ఏమో కానీ.. 2017లో ఆయనకు జరిగిన భారీ యాక్సిడెంట్ ను ఇంకా మరువకముందే.. మల్లి ఈలా జరగటం చాల బాధాకరం..

మంగళవారం రాత్రి రామోజీ ఫిలింసిటీ లో షూటింగ్ పూర్తి చేసుకుని ఆయన బెంజ్ కార్ లో తిరిగి వస్తున్నారు. కార్ ఔటర్ రింగ్ రోడ్ లో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద డివైడర్ ని ఢీ కొట్టింది. దీంతో కార్ పలుమార్లు రోడ్ పైన ఫల్టీలు కొట్టిందని తెలుస్తోంది. ప్రమాద సమయం లో రాజశేఖర్ తోపాటు మరో వ్యక్తి కూడా కారులో ప్రయాణిస్తున్నారు. ఇద్దరూ స్వల్ప గాయాలతో తప్పించుకొన్నారు. సకాలం లో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం తో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.

ఈ ప్రమాదం పై హీరో రాజశేఖర్ స్పందించారు. “మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు” అని అన్నారు.