Homeసినిమా వార్తలువరదలో కొట్టుకెళ్లిన టాలీవుడ్‌ హీరో తాత ఇల్లు

వరదలో కొట్టుకెళ్లిన టాలీవుడ్‌ హీరో తాత ఇల్లు

Hero Sharwanand: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు ముంచెత్తడంతో నదీ పరివాహక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. దీంతో అనేక గ్రామాలు వరద నీటిలో మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అన్ని వరదలు కూడా భీభత్సంగా వస్తున్నాయి. భారీ వర్షాలతో మాములు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఈ భారీ వర్షాలు టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌కు చిన్న పాటి బాధను కలిగించింది.

కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలోని ఎడ్లలంక గ్రామం కూడా ముంపులో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో అదే గ్రామంలో ఉన్న హీరో శర్వానంద్ తాత, భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్ ఇల్లు కొట్టుకుపోయింది. పాతకాలం నాటి ఇల్లు కావడంతో మొత్తం నదిలో కలిసిపోయింది. శర్వానంద్‌ అవనిగడ్డ వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోనే ఉండేవారు. వరదనీటిలో శర్వానంద్‌ తాత ఇల్లు కొట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY