ఇవే దసరాకు రిలీజ్ అవ్వబోతున్న స్టార్ హీరోల టీజర్లు
ఇవే దసరాకు రిలీజ్ అవ్వబోతున్న స్టార్ హీరోల టీజర్లు

movie trailer on Dasara 2020: కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. షూటింగ్ లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. దాంతో పెద్ద సినిమాలన్నీ విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. కొన్నిసినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ను నమ్ముకొని విడుదల అయ్యాయి. అయితే ఈసినిమా షూటింగ్ లకు అనుమతులు రావడం , థియేటర్స్ కూడా త్వరలో ఓపెన్ అవుతుండటంతో సినిమా ఇండస్ట్రీకి తిరిగి కళ వచ్చింది. చివరిదశలో ఉన్న సినిమాను చకచకా పూర్తి చేస్తున్నారు దర్శకులు.

ఇక దసరాను టార్గెట్ చేశారు స్టార్ హీరోలు. దాదాపు 7 నెలలుగా తమ సినిమా అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులకు సార్ప్రైజ్ ఇచ్చేందుకు దసరాను టార్గెట్ గా పెట్టుకున్నారు. దసరాకనుకగా బిగెస్ట్ ఫిలిం కేజీఎఫ్ 2 నుంచి టీజర్ ను ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్ .

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కతుంది. దసరాకు టీజర్ ను ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ నుంచి దసరా కానుక రామరాజు ఫార్ భీమ్ అని జక్కన అనౌన్స్ చేసేసాడు. ఇందుకు సంబంధిన మేకింగ్ వీడియోను కూడా ఇప్పటికే విడుదల చేసాడు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాకూడా ఈ టీజర్ల ఫైట్ లో అడుగుపెట్టనుంది తెలుస్తుంది. దసరా కానుకగా టీజర్ ను విడుదల చేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు.

ఇక డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమానుంచి కూడా టీజర్ ను దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట సినిమానుంచి కూడా టీజర్ ను విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు పరశురామ్ . షూటింగ్ ను చకచకా పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మహేష్ కూడా ప్రయత్నిస్తున్నాడు.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.

నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమా నుంచి కూడా టీజర్ దసరా కానుకగా వచ్చే అవకాశం ఉంది. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ కు సంబంధించిన అప్డేట్ దసరాకు వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.