Tollywood natural star Nani reacts on nepotism in Tollywood

టాలీవుడ్ లో బిజీ హీరో గా కొనసాగుతున్న హీరో నాని (Nani) తన సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V”మూవీ (V Movie) సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. “V”మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో నాని తన మనసులో మాట ను వెల్లడించారు.

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనే అంశం ఎప్పటినుంచో చర్చనీయాంశంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది నటీనటులు ఈ అంశంపై నోరువిప్పారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో నానికి.. టాలీవుడ్‌లో నెపోటిజం ఉందా? స్టార్ కిడ్స్‌తో ఏవైనా చేదు అనుభవాలున్నాయా? అనే ప్రశ్న ఎదురుకావడంతో ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. ఈ మేరకు ఎన్టీఆర్, మహేష్ బాబుల క్యారెక్టర్స్ ఎలాంటివో చెప్పారు నాని.

బాలీవుడ్ గురించి తెలియదు కానీ మన టాలీవుడ్‌లో మాత్రం అలాంటివేమీ పెద్దగా లేవని చెప్పుకొచ్చాడు నాని. తన కెరీర్ బిగినింగ్ నుంచే అంతా సహకరించారని, అలాగే తన సినిమాల గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం గానీ, ఎక్కడైనా ఫంక్షన్‌లో నేను కలిసినప్పుడు నన్ను పలకరించడం గానీ.. అన్ని విషయాల్లో బిగ్గెస్ట్ స్టార్స్ ఫుల్ సపోర్ట్ చేశారని అన్నారు. అప్పుడున్న పెద్ద హీరోల్లో మహేష్ బాబు, తారక్, రానా లాంటి స్టార్ కిడ్స్ చాలా ప్రేమగా పలకరించేవారని, తన సినిమాలపై వారి వారి అభిప్రాయలు కూడా చెప్పేవారని ఆయన పేర్కొన్నారు.