ఆర్ ఆర్ ఆర్ నుంచి అఖండ వరకు షూటింగ్స్ షురూ..!

0
147
tollywood upcoming movie shooting details

RRR to Akhanda shooting: క్రేజీ డైరెక్టర్లతో స్టార్ హీరోలు వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేసి ఫుల్‌గా ఎంగేజ్ అవుతున్నారు. రాబోయే 2,3 ఏళ్లకు డైరీని ఫిల్ చేసేసుకుంటున్నారు. క్రేజీ కాంబినేషన్స్ కమిట్ అవుతున్నారు. కానీ, అవి వర్కౌట్ అవుతాయా లేదా అన్నది మాత్రం డౌట్ ఫుల్‌గానే ఉంటోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్‌లు పుంజుకున్నాయి. అయితే ఈ షూటింగ్‌ జరుపుకునేందుకు కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా తక్కువు మందితో జరుపుకోవాలి. అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. కొత్త సినిమాల షూటింగ్ స్టార్ట్ చేయకూడదు.. వంటివి ముఖ్యమైనవి. ఇక తాజా షరతులతో చాలా వరకు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఏ సినిమాలు ఎక్కడ జరుపుకుంటున్నాయి..

 

Jr NTR Ram Charan resumes RRR movie shooting

RRR Movie shooting: దీన్ని ఎస్.ఎస్ రాజమౌళి రచించి దర్శకత్వం వహిస్తున్నారు.ఎన్.టి.రామారావు, రామ్ చరణ్ తేజ, అలియా భట్, అజయ్ దేవగన్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా ఈ చిత్రం ని నిర్మిస్తున్నారు. ఇపుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతుంది..

Chiranjeevi Acharya movie shooting stated in hyderabad

Chiranjeevi Acharya shooting: కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న తెలుగు చలనచిత్రం. ఈ సినిమాలో చిరంజీవి, రాం చరణ్ తేజ‌, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. మే 13న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇపుడు ఆచార్య సినిమా షూటింగ్ కోకాపేటలో ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది..

Nani Shyam Singha Roy resumes movie shooting on this date

Nani shyama singha roy Shooting: శ్యామ్‌ సింగరాయ్ కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న తెలుగు సినిమా. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్యామ్‌ సింగరాయ్‌ కి‌ రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి కథ సత్యదేవ్‌ జంగా, ఎడిటింగ్ నవీన్ నూలి, మిక్కీ జె. మేయర్ సంగీతమందిస్తున్నాడు.. నాని శ్యామ్ సింగారాయ్ cbit కాలేజ్ పరిసర ప్రాంతంలో వేసిన సెట్‌లో జరుగుతుంది.

Naga Chaitanya Thank you Movie shooting Update

Naga Chaitanya Thank you shooting: దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే చిత్రబృందం ఎంతో సాహసం చేసి ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. మిగిలిన షూటింగ్ పార్ట్ ని ఇప్పుడు సికింద్రాబాద్‌లో జరుగుతుంది.

Nithiin Maestro shooting update

Nithiin Maestro shooting: కరోనా సెకండ్‌ వేవ్‌ తో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా హైదరాబాద్‌లో మాస్ట్రో ముఖ్య సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన హీరో నితినే కావడం విశేషం. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Allu Arjun Pushpa Shooting Update

Pushpa movie shooting: సుకుమార్ దర్శకత్వంలో బన్నీ, రష్మిక కలిసి నటిస్తున్న పుష్ప మూవీ రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నది. కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలోనూ కొన్నిరోజుల పాటు ‘పుష్ప’ షూటింగ్ జరిపారు. ఆ తర్వాత బ్రేక్ ఇచ్చిన యూనిట్.. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడం, లాక్‌డౌన్‌ సడలింపులు రావడంతో మళ్లీ రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు. ఈనెల 28 నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పుష్ప షూటింగ్ జరుగనుంది.

Venkatesh F3 Movie shooting details

F3 Movie Shooting: వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్న ఎఫ్-3 సినిమా షూటింగ్ జూలై ఒకటి నుంచి హైదరాబాద్ లో జరుగనుంది.

Mahesh Babu sarkaru vaari paata resumes shooting from this date

Mahesh Babu Sarkaru Vaari Paata shooting: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా స్టార్ట్ చేసినా కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటాడు. సెకండ్ వేవ్ మొదలు కాకపోయి ఉంటే ఇప్పటికే సర్కారు వారి పాట సందడి మొదలయ్యి ఉండేది. మహేష్ సర్కార్ వారి పాట జూలై ఐయిదు నుంచి హైదరాబాద్‌లో జరుగనుంది అని సమాచారం..