triple dhamaka for young rebel star prabhas fans in dussehra

Prabhas: ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాను చేస్తున్నాడు. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. తర్వాత నాగ అశ్విన్‌తో, అనంతరం ఓం రావుత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ సినిమాలు లైన్లో పెట్టాడు. ఈ ఏడాదిలో సినిమా ఎలాగైనా వస్తుంది అనుకుంటే కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆరు నెలల పాటు నిలిచి పోయి ఇటీవలే పునః ప్రారంభం అయ్యింది.

అయితే రాధేశ్యామ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్‌లుక్ తప్ప ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ చెందుతున్నారు. కనీసం దసరా పండుగకైనా ‘రాధేశ్యామ్’ టీమ్ అప్‌డేట్ ఇస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23), దసరా పండుగలకు కలిపి ఒకేసారి బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసా ‘రాధేశ్యామ్’ టీజర్. అలాగే రేపు నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా సంభందించి ఒక అప్డేట్ రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు..

ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ లో రాధేశ్యామ్ చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను మరియు ఆదిపురుష్ సినిమాను ఇతర నిర్మాణ సంస్థల్లో చేస్తున్నాడు. ఆ రెండు సినిమాల తర్వాత మళ్లీ తన హోం బ్యానర్ అయిన యూవీ క్రియూషన్స్ లోనే చేయబోతున్నాడట. 2022లో ప్రభాస్ తో కేజీఎఫ్ స్టార్ ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ఆ విషయమై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.