Trisha has been roped into the Jersey Tamil remake

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. క్రికెటర్ నేపథ్య సాగే ఎమోషనల్ కథతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కట్టిపడేశాడు. సితారా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది సమ్మర్ లో విడుదలైన ‘జెర్సీ’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని తమిళ్ హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి ముందుకొచ్చారు.

కాగా బాలీవుడ్ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ తో ‘జెర్సీ’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ – దిల్ రాజు – సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. యంగ్ హీరో విష్ణు విశాల్ జెర్సీ తమిళ రీమేక్ లో హీరోగా నటించబోతున్నాడు..తెలుగు ‘జెర్సీ’లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో కూడా నటించబోతుందని అనుకున్నారు. ఆ తర్వాత అమలా పాల్ మరోసారి విష్ణుతో జత కట్టబోతోందని న్యూస్ వచ్చింది.

అమలాపాల్ ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. ఇప్పుడు లేటెస్టుగా స్టార్ హీరోయిన్ త్రిష ఈ రీమేక్ లో నటిస్తోందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్రిష ప్రస్తుతం ‘పారపాధమ్ విలయట్టు’ ‘గర్జనాని’ ‘పొన్నియన్ సెల్వన్’ ‘రాంగీ’ ‘షుగర్’ ‘రామ్’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళ జెర్సీ రీమేక్ కు నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించబోతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.