సెట్స్ పైకి మళ్లీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో ..!

0
152
Trivikram And Allu Arjun Combo For Rapido Ad shoot

Allu Arjun, Trivikram: టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ మరోసారి జతకట్టారు.

అయితే ఈసారి సినిమా కోసం కాదు. వీరిద్దరూ ఒక యాడ్‌ కోసం పనిచేస్తున్నారు. అల్లు అర్జున్‌ మెయిన్‌ లీడ్‌గా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ వాణిజ్య ప్రకటన తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ర్యాపిడో కోసం ముందుకు వచ్చాడు. యాడ్స్‌ను తెరకెక్కించడంతో త్రివిక్రమ్ శైలి వేరు.

ఇక ఈ రోజు రాపిడో యాడ్ షూట్ చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. దాంతో బన్నీ త్రివిక్రమ్ తో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలో కనిపించబోతున్న లుక్ లో మాసిన్ గడ్డం మరియు లాంగ్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నారు.

Also Read: సురేందర్ రెడ్డి, పవన్ మూవీ అప్డేట్..! 

Trivikram And Allu Arjun Combo For Rapido Ad shoot

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

Also Read: మహేష్ మూవీలో బాలీవుడ్ స్టార్! 

 

Previous articleUpcoming Telugu Movies in OTT September 2021
Next articleప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్ షెడ్యూల్ డేట్ ఫిక్స్..!