Homeసినిమా వార్తలు' అ' టైటిల్ సెంటిమెంట్ ను పక్కన పెట్టిన త్రివిక్రమ్.!!

‘ అ’ టైటిల్ సెంటిమెంట్ ను పక్కన పెట్టిన త్రివిక్రమ్.!!

Trivikram Guntur Kaaram title sentiment, Trivikram title sentiment, Guntur Kaaram shooting update, Guntur Kaaram latest shooting schedule, Guntur Kaaram trailer date, Pooja Hedge, Sreeleela

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్లో మూడవ చిత్రం కు లేటెస్ట్ గా గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇంతకుముందు వచ్చిన చిత్రాలు మంచి సక్సెస్ను సాధించాయి. అతడు మరియు ఖలేజా చిత్రాలు మహేష్ బాబును వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మహేష్ బాబు అతడు లో డైలాగ్ డెలివరీ కి ఫాన్స్ ఫిదా అయిపోయారు.

ఖలేజా లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఖలేజా మూవీలో మహేష్ బాబు తో పాటు మిగిలిన క్యారెక్టర్స్ మధ్య కూడా జరిగే డిస్కషన్ కానీ డైలాగ్స్ కానీ డిఫరెంట్ గా చాలా యూనిక్ గా ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ముందు నుంచి అ అనే అక్షరం తోటే టైటిల్ ఉంటుంది అని ఒక టాక్ నడుస్తూ వస్తోంది.

దీనికి కారణం గత కొన్ని సినిమాల నుంచి త్రివిక్రమ్ కు ఏర్పడిన ‘అ’లెటర్ తో మొదలయ్యే టైటిల్స్ యొక్క సెంటిమెంట్ అని చెప్పవచ్చు. అయితే త్రివిక్రమ్ కి ఈ సెంటిమెంట్ మొదటి నుంచి లేదు.. నువ్వే నువ్వే, అతడు ,కలేజా ,జల్సా ,జులాయి ఇలా అన్ని చిత్రాలకు ఆ అనే అక్షరంతో టైటిల్ గురించి ఆలోచించలేదు. అయితే అత్తారింటికి దారేది సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ నెక్స్ట్ మూవీకి సన్నాఫ్ సత్యమూర్తి అనే టైటిల్ లు పెట్టారు.

కానీ అ ఆ మూవీ దగ్గరనుంచి వరుసగా త్రివిక్రమ్ తీసిన అన్ని చిత్రాలకు అ అనే అక్షరం తోటే టైటిల్ రావడం గమనార్హం. అజ్ఞాతవాసి ,అరవింద సమేత ,అలవైకుంఠపురం ఇలా వరుసగా నాలుగు చిత్రాలకు ఒకే అక్షరంతో టైటిల్ మొదలైంది. దీంతో ఇక త్రివిక్రమ్ అ అనే టైటిల్ సెంటిమెంట్ అన్న ముద్ర పడిపోయింది. ఈ క్రమంలో మహేష్ బాబు మూవీ కి కూడా అమరావతికి అటు ఇటు అనే టైటిలే బాగుంటుంది అని అనుకున్నప్పటికీ తీరా ఈ టైటిల్ గ్లిమ్స్ చూశాక ఇది సెట్ కాదు అనుకున్నారట.

Trivikram Guntur Kaaram title sentiment

అయితే మహేష్ బాబు మూవీ నేపథ్యంలో త్రివిక్రమ్ తన పాత అలవాట్లను పక్కన పెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందులో మొదటిది సినిమా టైటిల్ కు సంబంధించిన సెంటిమెంట్ అయితే రెండవది సినిమా విడుదల ముందు వరకు టైటిల్ ప్రకటించే అలవాటు లేని త్రివిక్రమ్ ఇప్పుడు గ్లిమ్స్ తో పాటు టైటిల్ని ప్రకటించడం కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ విషయానికి వస్తే మాత్రం పక్క మాస్ కట్ అవుట్ తో మిర్చి యార్డ్ లో ఫైట్ చేస్తూ మహేష్ బాబు ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.. ఈ ఒక్క గ్లిమ్స్ చిత్రంపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY