Trivikram House Set For Tabu on _Ala Vaikunthapuramulo_ Movie
Trivikram House Set For Tabu on _Ala Vaikunthapuramulo_ Movie

బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ టబు కోసం మాటల మాంత్రికుడు అత్యంత విలాసవంతమయిన ఇల్లు కట్టించాడు.అదేంటి అని కన్ఫ్యుస్ కాకండి.ఆ ఇల్లు కట్టించింది బన్నీ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘అల వైకుంఠపురములో…’ సినిమాలో కీలకమయిన సీన్స్ షూట్ చెయ్యడం కోసం.ఆ సినిమాలో ఇప్పటివరకు ఎక్కువగా ఫైట్స్ మాత్రమే షూట్ చేసారు.అయితే సినిమాలో కీలకమయిన సీన్స్ అన్నీ కూడా టైటిల్ లో ఉన్న వైకుంఠపురం అనే ఇంటి నేపథ్యంలో జరుగుతాయి.ఆ సీన్స్ అన్నీ కూడా ఈ ఇంటి సెట్ లో షూట్ చేస్తారు.

సినిమా స్క్రిప్ట్ ప్రకారం ఆ ఇల్లు ‘టబు’ది.సినిమాలో మేజర్ పార్ట్ ఆ ఇంట్లోనే షూట్ చెయ్యాల్సి ఉండడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఏకంగా 5 కోట్లకు పైగా ఖర్చుతో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆ ఇంటి సెట్ ని నిర్మించారు.వచ్చేనెలలో స్టార్ట్ అయ్యే తాజా షెడ్యూల్ ఏకంగా నెల రోజులపాటు ఏకధాటిగా జరగనుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ పేరు అలకనంద.అందుకే ఆమె పేరులోని అల ని కట్ చేసి వైకుంఠపురం అనే ఇంటికి జత చేసి అలవైకుంఠపురములో అనే టైటిల్ పెట్టారు.అదీ ఈ టైటిల్,అందులోని ఇంటి కథ.