Trivikram Jr NTR Combination Set Again Movie latest Updates
Trivikram Jr NTR Combination Set Again Movie latest Updates

అజ్ఞాతవాసి సినిమాతో పోగొట్టుకున్న పేరుని,క్రేజ్ ని మళ్ళీ అరవింద సమేత సినిమాతో తిరిగితెచ్చుకున్నాడు త్రివిక్రమ్.ప్రస్తుతం అల్లు అర్జున్ కి హ్యాట్రిక్ అందించే పనిలో బిజీ గా ఉన్న గురూజీ నెక్స్ట్ చెయ్యబోయే సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంది.కానీ ఏది వెనుక,ఏది ముందు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.అయితే ఇప్పుడు ఆ ప్రశ్నకు ఆల్మోస్ట్ ఆన్సర్ దొరికింది.అల్లు అర్జున్ తరువాత మళ్ళీ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ మాటల మాంత్రికుడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

నిజానికి త్రివిక్రమ్-చిరు ల కాంబో లో రామ్ చరణ్ సినిమా సెట్ చేసాడు.అదే విషయం చిరంజీవి కూడా చెప్పాడు.కానీ సైరా లేట్ అవ్వడంతో లెక్కలు మారిపోయాయి.అల్లు అర్జున్ సినిమా పూర్తి అయ్యి రిలీజ్ అయ్యే టైం కి చిరు-కొరటాల సినిమా సెట్స్ మీద ఉంటుంది.అది ఫినిష్ అయ్యే వరకు వెయిట్ చెయ్యడం కుదరదు కాబట్టి.అప్పటికి ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు కాబట్టి ఎన్టీఆర్ తో ఈ సారి ఒక హిలేరియస్ ఎంటెర్టైనెర్ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడట త్రివిక్రమ్.అరవింద సమేత ఎక్కువగా ఎన్టీఆర్ స్టైల్ లో ఉంటుంది.ఈసారి మాత్రం త్రివిక్రమ్ టచ్ ఉండే సినిమా చెయ్యడానికి ఇద్దరూ ఓకే అనుకున్నారు.అందుకే ఎన్టీఆర్ తన పుట్టిన రోజు టైం లో నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో అని చెప్పేసాడు.సో,అరవింద సమేత కాంబినేషన్ ఈ సారి మాత్రం నవ్వుల విందు అందించడానికి రెడీ అవుతుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]