అరవింద్ రామాయణం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న త్రివిక్ర‌మ్‌..?

0
1245
Trivikram Preparing Script For Allu Aravind Ramayanam movie

అల్లు అర‌వింద్… మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రాల‌తో క‌లిసి రామాయ‌ణంను త్రీడీ టెక్నాల‌జీతో ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు గ‌త ఏడాదిన ప్ర‌క‌టించారు. చిత్రంలో హైరేంజ్ విజువల్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనకాడటం లేదు. మన‌కు సంబంధించి పౌరాణిక చిత్రాలంటే ఎక్కువ‌గా రామాయ‌ణం, మ‌హాభార‌తాలే.. ఎన్నిసార్లు ఈ పౌరాణికాల‌ను సినిమాలుగా తీస్తే అన్నింటినీ ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఈ నేపథ్యంలోనే బడా నిర్మాత అల్లు అరవింద్ ‘రామాయణ’ రూపంలో మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో త్రివిక్రమ్ కూడా భాగం కాబోతున్నారని తెలిసింది.

దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితిశ్ తివారి, మామ్ ద‌ర్శ‌కుడు ర‌వి ఉద్యావ‌ర్ కాంబినేష‌న్‌లో ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తామ‌ని తెలిపారు. భారత దేశ సినీ పరిశ్రమ గర్వించే రేంజ్‌లో పలు భాషల్లో ‘రామాయణ’ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రపంచ ఆడియన్స్ టార్గెట్‌గా భారీ హంగులతో ఈ సినిమా రూపొందనుందని విన్నాం. టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌డైన త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నాడ‌ట‌. రామాయ‌ణం మొత్తాన్ని మూడు గంట‌ల్లో కుదించి త్రివిక్ర‌మ్ మాట‌లు రాస్తున్నాడ‌ని స‌మాచారం. తెలుగులో స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిన త‌ర్వాతే మిగిలిన భాష‌ల‌కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జరుగుతుంద‌ని అంటున్నారు.

ఈ కథను సానబట్టి రోమాలు నిక్కబొడిచే డైలాగ్స్ రాయాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అల్లు అరవింద్ కీలక బాధ్యతలు అప్పజెప్పారని సమాచారం. దీనికి ఓకే చెప్పిన త్రివిక్రమ్ తనదైన శైలిలో స్క్రీన్ ప్లే అందించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. తార‌క్ సినిమా స్టార్ట్ అయ్యే వ‌ర‌కు త్రివిక్ర‌మ్ ఈ స్క్రిప్ట్ వ‌ర్క్ మీద‌నే కూర్చుంటాడ‌ని టాక్ వినిపిస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించాలని అనుకుంటున్నారట. మ‌రి అర‌వింద్ నిర్మించ‌బోయే ఈ త్రీడీ రామాయ‌ణంలో రాముడిగా ఎవ‌రు న‌టిస్తార‌నేది కూడా ఆస‌క్తిని క‌లిగించే అంశ‌మే.