త్రివిక్రమ్ తో సినిమా అంటే ఎవరయినా నో చెప్పే అవకాశం లేదు.కానీ అజ్ఞాతవాసి అనే ఒకే ఒక్క సెట్ బ్యాక్ గురూజీ కి దాటలేని స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది.అయితే మళ్ళీ NTR తో అరవింద సామెత తీసి ఫామ్ లోకి వచ్చాడు.అయితే వెంకీ తో సినిమా చెయ్యాలి ఉన్నా ఎందుకోగానీ బన్నీ కోసం ఊ అన్నాడు.వాళ్ళిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా కావడంతో కాస్త ప్రెజర్ పడుతున్నా ముందుకు సాగుతున్నాడు.
[INSERT_ELEMENTOR id=”3574″]
అయితే ఈ సినిమా తరువాత మళ్ళీ NTR తో త్రివిక్రమ్ సినిమా పక్కా అనుకున్నారు అంతా.దీనికి కారణం త్రివిక్రమ్ తో తన సినిమాని ఎన్టీఆర్ కన్ఫర్మ్ చెయ్యడమే.ఎన్టీఆర్ తో సినిమా అనే మాట మెటీరియలైజ్ అయ్యే పరిస్థితి ఇప్పట్లో లేదు అనే కొత్త మాట వినిపిస్తుంది.దానికి కారణం స్వయంగా చిరంజీవి పబ్లిక్ స్టేజ్ పై త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేసాడు.కొరటాల సినిమా అవ్వగానే చిరంజీవి త్రివిక్రమ్ సినిమా కోసం డేట్స్ కేటాయిస్తాడు.ఆల్రెడీ ఈ సినిమా కోసం ఆల్రెడీ ప్రెపేర్డ్ గా ఉన్నాడు దానయ్య.RRR తో సంబంధం లేకుండా చిరు-త్రివిక్రమ్ సినిమాకి సెపరేట్ గా ఏర్పాట్లు చేసాడు అని అంటున్నారు.
బన్నీ తరువాత చిరు అంటే బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోస్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి.మెగాస్టార్ తో సినిమా చేసాక కూడా మెగా కాంపౌండ్ నుండి బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది త్రివిక్రమ్ కి.దానికి కారణం పవన్ కళ్యాణ్.పవన్ సినిమా అంటే త్రివిక్రమ్ నో చెప్పే అవకాశం లేదు.అజ్ఞాతవాసి తరువాత కూడా త్రివిక్రమ్ పై పవన్ నమ్మకం ఇంచ్ కూడా తగ్గలేదు.అందుకే పవన్ సినిమా త్రివిక్రమ్ తో అనేది ఆల్మోస్ట్ పక్క అయిపోయింది.
[INSERT_ELEMENTOR id=”3574″]
కాకపోతే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే పవన్ కేవలం నిర్మాత మాత్రమే.పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే పేరుతో పవన్ ఒక బ్యానర్ స్టార్ట్ చేసి చాలా కాలం అయ్యింది.కానీ ఎప్పటికప్పుడు ఆ బ్యానర్ మీద సోలో గా సరయిన సినిమా ఒకటి చెయ్యాలని చూస్తున్నాడు.కానీ అది కుదరడం లేదు.అందుకే ఇప్పుడు స్వయంగా పవన్ కేవలం నిర్మతగా ఉంటూ,రామ్ చరణ్ హీరో గా సినిమా చెయ్యాలి అనేది ప్రపోజల్.దానికి త్రివిక్రమ్ డైరెక్టర్.పవన్ బ్యానర్ గట్టిగా నిలదొక్కుకోవడానికి ఇంతకుమించిన కాంబినేషన్ సెట్ చెయ్యడం కష్టం.సో,పవన్ అడిగితే కాదనలేడు కాబట్టి చరణ్ తో గురూజీ అనేది కూడా ఫిక్స్.
ఇలా వరుసగా మూడు సినిమాలు మెగా కాంపౌండ్ హీరోలతో చేసాక కానీ మిగతా వాళ్ళని డైరెక్ట్ చేసే పరిస్థితి లేదు.సో,మిగతావాళ్లంతా ఆ మూడు సినిమాలు పూర్తయ్యేవరకు వెయిటింగ్ లో ఉండాల్సిందే.
[INSERT_ELEMENTOR id=”3574″]