Trolls On Vijay Devarakonda Pink Suit photo shoot
Trolls On Vijay Devarakonda Pink Suit photo shoot

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ స్టైల్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఈ క్రమంలో రకరకాల డిజైన్స్ లో డ్రెస్సులు వేసుకుంటూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాడు. విజయ్ దేవరకొండ ఇప్పుడున్న టైర్-2 హీరోల్లో నెంబర్ 1 హీరో అని చెప్పొచ్చు. యూత్ కు కనెక్ట్ అయ్యే స్టోరీలను ఎంచుకుంటూ వారిని బాగా ఆకర్షిస్తున్నాడు. ఈ ఏడాది ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో పెద్ద ప్లాప్ అందుకున్న విజయ్.. ఇప్పుడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరో పక్క పూరి జగన్నాధ్ తెరకెక్కించే ‘ఫైటర్’ చిత్రం కోసం కూడా రెడీ అవుతున్నాడు.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ స్టైల్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఈ క్రమంలో రకరకాల డిజైన్స్ లో డ్రెస్సులు వేసుకుంటూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాడు. రీసెంట్ గా ఈ హీరో పింక్ కలర్ సూట్ ఒకటి వేసుకున్నాడు. బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్స్ అవార్డ్స్’ నిర్వహించిన ఏడవ ఎడిషన్ ఫంక్షన్ కోసం విజయ్ ఈ విధంగా రెడీ అయ్యాడు. తన సినిమాలో వేడుకల్లో కూడా చిత్ర, విచిత్ర మైన డ్రెస్సులతో వార్తల్లోకి ఎక్కే విజయ్. ‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ వేడుకలో లుంగీలో హాజరయ్యాడు. ఆ తరువాత కూడా చాలా వింత వింత డ్రెస్సుల్లో దర్శనమిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈసారి పింక్ సూట్ ఫోటో షూట్ మాత్ర చాలా తేడా కొట్టింది. దీంతో విజయ్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. రకరకాలు గా విజయ్ ఫోటోలను ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు.