‘టక్‌ జగదీశ్‌’ పాట అదుర్స్‌..!

0
25
Tuck Song From Nani's Tuck Jagadish Out

Tuck Jagadish Songs: నాని హీరోగా నటించిన `టక్ జగదీష్` ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొందు‌తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలు శ్రోత‌ల‌ను అల‌రిస్తుండగా టీజ‌ర్‌, ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ అందరి ప్రశంసలను గెలుచుకుంది.

ఈ రోజు గోపి సుందర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని `టక్ పాట`ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ సారి ఒక ఇంటెన్స్ నెంబ‌ర్ సాంగ్‌తో మ‌న‌ముందుకు వ‌చ్చారు. ఈ పాటను ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ స్వయంగా పాడ‌డం విశేషం. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ట‌క్ జ‌గ‌దీష్ వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్‌10 నుండి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Tuck Song From Nani Tuck Jagadish

రీతు వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య రాజేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది, నాని సోద‌రుడిగా విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

Tuck Song From Nani Tuck Jagadish