సీరియల్‌‌ నటి శ్రావణి ఆత్మహత్య

0
892
tv serials actress sravani suicide in hyderabad

Serial Actress sravani suicide: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రస్తుతం మనసు మమత, మౌనరాగం సీరియల్స్‌తో పాటూ మరికొన్నిటిలో శ్రావణి నటించారు. శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

హైదరాబాద్ ఎస్సార్ నగర్ పిఎస్ పరిధిలోని మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ సెకండ్ ఫ్లోర్‌లో నివసిస్తున్న శ్రావణి, అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రావణి తెలుగు సీరియల్స్ లో నటిస్తున్నారు. ‘మౌనరాగం’, ‘మనసు మమత’ లాంటి పలు సీరియల్‌లో ఆమె నటిస్తున్నారు. అయితే ‘టిక్ టాక్’లో పరిచయమైన దేవరాజు రెడ్డి అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

శ్రావణి గత కొన్నేళ్లగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి అలియాస్ సన్నీతో టిక్ టాక్ పరిచయం ఏర్పడింది.. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని ఆమెకు దగ్గరయ్యాడు. తర్వాత దేవరాజ్ శ్రావణిని వేధింపులకు గురి చేశాడని చెబుతున్నారు. ఆ మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.