Homeసినిమా వార్తలుతారాస్థాయికి చేరిన మహేష్ vs విజయ్ ఫ్యాన్స్ వార్

తారాస్థాయికి చేరిన మహేష్ vs విజయ్ ఫ్యాన్స్ వార్

సోషల్ మీడియా లో ఫాన్స్ వార్ కొత్తవి కాదు ఇది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక టైమ్ లో ఏదో ఒక హీరోతో ఫ్యాన్స్ పోటీ పడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు సౌత్ ఇండియా కు సంబంధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అలాగే దళపతి విజయ్ (Vijay) ఫ్యాన్స్ వార్ ట్విట్టర్ లో తారాస్థాయికి చేరింది.

దక్షిణాదిలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు వీళ్లిద్దరు. విజయ్ (Vijay) హీరోగా వచ్చిన తొలినాళ్లలో మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలని రీమేక్ చేస్తూ అక్కడ సూపర్ హిట్ కుట్టేవాడు అలాగే మహేష్ విజయ మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది. కానీ ఫ్యాన్స్ మధ్య అది లేదన్నట్టు ఈ రెండు రోజుల నుంచి తెలుస్తోంది.

అసలు ఈ ఫాన్స్ వార్ కి కారణం ఏందంటే, మహేష్ బాబు నటించిన సర్కారువారిపాట సినిమా నుంచి కళావతి అనే మొదటిసాంగ్ ఈనెల 14వ తేదీన విడుదల కానుంది. అదే రోజు విజయ్ నటించిన బీస్ట్ నుంచి సింగిల్ కూడా రాబోతోంది. తమ అభిమాన హీరోల నుంచి వచ్చే పాటలను ఆనందంగా ఆస్వాదించాల్సింది పోయి.. ట్విట్టర్ లో వార్ మొదలుపెట్టారు.

సోషల్ మీడియాలో నేషనల్ ట్రోల్ మెటీరియల్ విజయ్ అనే హ్యాష్ ట్యాగ్ లను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. అయితే “అవమానాన్ని భరించేవాడు కాదు మావాడు!” అంటూ విజయ్ అభిమానులు #BoycottGayMaheshBabu ట్రెండింగ్ ని ప్రారంభించారు. ఈ రెండు హ్యాష్ ట్యాగ్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసే కొన్ని అసహ్యకరమైన ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి.

ఈ ఆరోపణలు కాస్తా పెద్దవై.. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ తీవ్రరూపం దాల్చి ఆ పై నెగిటివ్ ట్రెండ్స్‌తో దాడి మొదలెట్టారు. ఈ రెండు సినిమాల పాటలు విడుదల కావటానికి చాలా టైమ్ ఉన్నా వీరి ఫ్యాన్‌ వార్ మాత్రం తారాస్థాయికి చేరింది.

ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ తో చేయబోయే ssmb28 సినిమా తొందరగా పూర్తి చేసుకొని తర్వాత రాజమౌళి సినిమా చేయాలని చూస్తున్నారు. అలాగే దళపతి విజయ్ కెరీర్ స్వింగ్ లో ఉంది. అతడు రష్మిక మందనతో కలిసి దళపతి 66 లో నటిస్తున్నాడు.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles