సాయి పల్లవి ఖాతాలో రెండు 50 మిలియన్ల సాంగ్స్

385
two fastest 50 Million songs in sai pallavi account

సాయి పల్లవికి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. చేసిన సినిమాలు తక్కువే అయినా క్రేజ్ మాత్రం చాలా ఎక్కువ. సహజంగా కనిపించడం, సహజంగా నటించడంతో సాయి పల్లవికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె నటించే పాటలు కూడా స్పీడ్ గా మిలియన్ల కొద్దీ వ్యూస్ పొందుతాయని ప్రూవ్ అవుతోంది.

ఇక సాయి పల్లవి డ్యాన్సులకు పడి పోని సినీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. అలా సాయి పల్లవి వీడియో సాంగ్స్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంటాయి. యూట్యూబ్‌లో దక్షిణాది మొత్తంలో సాయి పల్లవి సాంగ్స్ మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంటాయి. రౌడీ బేబీ ఏకంగా బిలియన్ వ్యూస్ కొల్లగొట్టేసింది.

ఇప్పటికే సౌత్‌లో రౌడీ బేబీదే రికార్డ్. ఇపుడు కేవలం 14 రోజుల్లోనే “సారంగ దరియా” 50 మిలియన్ల వ్యూస్ అందుకొంది. తక్కువ రోజుల్లో 50 మిలియన్ల పొందిన సౌత్ ఇండియన్ సినిమాల పాటల్లో రెండూ కూడా సాయి పల్లవి ఖాతాలోనే ఉండడం విశేషం.

  1. రౌడీ బేబీ (మారి 2) – 8 రోజులు
  2. సారంగ దరియా (లవ్ స్టోరీ) -14 రోజులు
  3. బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో) – 18 రోజులు
  4. వాతి కమింగ్ (మాస్టర్) – 21 రోజులు
  5. రాములో రాములా (అల వైకుంఠపురంలో) – 27 రోజులు