రామ్‌ సరసన ఇద్దరు భామలు ఫైనల్!

274
two-heroines-for-ram-pothineni-lingusamy-cinema
two-heroines-for-ram-pothineni-lingusamy-cinema

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. తమిళ దర్శకుడైన లింగుస్వామి ‘పందెం కోడి’, ‘రన్‌’, ‘ఆవారా’ తదితర అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన నేరుగా తెలుగులో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు.

ఎట్టకేలకు రామ్‌తో ఆ చిత్రం కుదిరింది. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్‌ సరసన ఇద్దరు భామలు నటించనున్నారు.  ఇందులో కృతిశెట్టిని కథానాయికగా ఎంపిక చేశారు.

కేవలం ఒకే ఒక్క సినిమాతో వరుసగా మూడు భారీ చిత్రాల అవకాశాల్ని సొంతం చేసుకొని కృతిశెట్టి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. కాగా మరో కథనాయికగా నివేత పేతురేజ్ మరోసారి రామ్ సినిమాలో నటించనుందట. ఇటీవలే రామ్ ‘రెడ్’ సినిమాలో నివేత నటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో నెగటివ్ రోల్ నివేతను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.