రెండు చిత్రాలతో రాబోతోన్న ‘నిశ్శబ్దం’ డైరెక్టర్‌

0
316
Two Movie Offers To Nishabdham Director Hemanth Madhukar

స్వీటీ అనుష్క, విలక్షణ నటుడు మాధవన్‌లతో చేసిన ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందించిన దర్శకుడు హేమంత్‌ మధుకర్‌. రివ్యూల పరంగా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం వ్యూయర్స్‌ పరంగా మాత్రం బిగ్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రం తర్వాత హేమంత్‌ మధుకర్‌ రెండు చిత్రాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో ఒకటి యాక్షన్‌ రొమాంటిక్‌ చిత్రం. ఈ చిత్రానికి రచయిత గోపీమోహన్‌ స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారట. ఈ చిత్రం కూడా ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని రూపొందించిన పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీనే నిర్మించనుందని టాక్‌ నడుస్తోంది.

మరో చిత్రం బాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రంగా రూపొందనుందట. బాలీవుడ్‌లో ‘ఏ ఫ్లాట్‌’ అనే చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న హేమంత్‌ మధుకర్‌ ఇప్పుడు ‘బాతే’ అనే టైటిల్‌తో మల్టీస్టారర్‌ చిత్రం ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘కహానీ, పింక్‌’ చిత్రాల రచయిత రితేష్‌ షా స్ర్కీన్‌ప్లే అందించనున్నారని, ఈ చిత్రం 70 శాతం షూటింగ్‌ లండన్‌లో జరగనుందని వార్తలు వినవస్తున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రానున్నాయని సమాచారం.

Previous articleఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన నాని ‘టక్ జగదీష్’..!
Next article‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ షిఫ్ట్ .. వారం రోజులు అక్కడే