Tollywood Ugadi 2023 Special updates: ఏదైనా పండుగ వస్తుందంటే టాలీవుడ్ సినీ అభిమానులు తమ ఫేవరేట్ హీరోలు నటిస్తున్న సినిమాల నుంచి మంచి అప్డేట్లు కోరుకుంటారు. అలా జరిగితేనే అది అసలైన పండుగ అని భావిస్తారు. రేపు (మార్చి 22) ఉగాది పండుగ కావడంతో ఫ్యాన్స్ అందరూ కొత్త అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఫస్ట్ లుక్స్, టీజర్లు, టైటిల్ అనౌన్స్ మెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొత్త సినిమాల ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నారు.
Tollywood Ugadi 2023 Special updates: ఉగాది స్పెషల్ గా యూత్ కింగ్ అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేయనున్నారు. ‘ఏందే ఏందే’ అనే ఈ పాట ప్రోమోని మార్చి 22న వదిలి, ఫుల్ సాంగ్ ను మార్చి 24న విడుదల చేయనున్నట్లు ఏకే ఎంటర్టైన్మెంట్స్ టీమ్ ప్రకటించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిప్ హాఫ్ తమిజ మ్యాజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 28న పాన్ ఇండియా స్థాయిలో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కానుంది.
Nagarjuna – Nag99: తెలుగు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కింగ్ అక్కినేని నాగార్జున తన కొత్త సినిమాను ప్రారంభించనున్నట్లు టాక్ నడుస్తోంది. అదే రోజున ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి వుంది. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఈ చిత్రంతో డైరక్టర్ గా పరిచయం కాబోతున్నారు.
Jr NTR – Koratala Siva: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న NTR30 మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నహాలు జరిగిపోయాయి. కాకపోతే ఉగాది రోజున కాకుండా, ఒక్క రోజు తర్వాత మార్చి 23న ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత తారక్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. 2024 సమ్మర్ లో రిలీజ్ చేసే విధంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
Mahesh Babu – Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న SSMB28 సినిమా నుంచి ఉగాది అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటుగా ఫస్ట్ లుక్ ఉంటుందని అనుకున్నారు. కానీ మేకర్స్ చివరి నిమిషంలో వారిని నిరాశ పరిచారు. శ్రీరామ నవమి సందర్భంగా మాస్ ఫీస్ట్ ఉంటుందని హారిక అండ్ హాసిని క్రియషన్స్ టీమ్ ప్రకటించింది.
Prabhas – Salaar- Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమా నేపథ్యానికి తగ్గట్టు శ్రీరామ నవమికి అప్డేట్ ఇచ్చి, ‘సలార్’ మూవీ నుంచి ఉగాదికి స్పెషల్ అప్డేట్ ఇవ్వాలని ఆశ పడుతున్నారు. అలానే మారుతి – ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా అనౌన్స్ మెంట్ కూడా వస్తుందేమో అనే కోరిక కూడా వుంది. కానీ ఇప్పటి వరకూ చిత్ర బృందాల నుంచి ఎలాంటి ప్రకటన లేదు.
Ram Charan – Shankar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు కూడా RC15 అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. శంకర్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా టైటిల్ ను ఉగాదికి ఇస్తారని ఆశించారు. కానీ దగ్గరలో చరణ్ బర్త్ డే ఉంది కాబట్టి, అదే రోజు మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ‘పుష్ప 2’ నుంచి స్పెషల్ పోస్టర్ వస్తే బాగుంటుందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాకపోతే వచ్చే నెలలో బన్నీ పుట్టినరోజు ఉంది కనుక, ఒక 3 నిమిషాల వీడియోని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Pawan Kalyan – Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలలో నటిస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ ‘భవదీయుడు భగత్ సింగ్’ OG, PKSDT లలో ఏ ఒక్క దాని నుంచైనా అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్పెషల్ పోస్టర్ లేదా వీడియో రావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైతే మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు.
ఇక ఉగాది రోజున సినీ అభిమానుల కోసం రెండు సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ మరియు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగ మార్తాండ’ సినిమాలు మార్చి 22న విడుదల కాబోతున్నాయి.