Ugram Movie Censor Review: నరేష్ (Allari Naresh) ప్రస్తుతం ఉగ్రం మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమాని విజయ్ కనకమెడల దర్శకత్వం వహించగా మే 5న విడుదలకు సిద్ధం చేశారు. మరికొన్ని గంటల్లో USA లో ప్రీమియర్ షోలు మొదలవుతాయి. చాలా సినిమాలు ఈ ప్రీమియర్ షో టాక్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఉగ్రం సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అలాగే టీజర్, సాంగ్స్ సినిమాపై భారీగానే అంచనాను పెంచాయి. అదేవిధంగా అల్లరి నరేష్ అలాగే మూవీ టీం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.
Ugram Movie Censor Review: ఈ సినిమాలో అల్లరి నరేష్ (Allari Naresh) పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ట్రైలర్ తోనే సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో దర్శకుడు చూపించారు. ఉగ్రం మూవీ మేకర్స్ విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా సెన్సార్ (Censor) చేయించడం జరిగింది. సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ విడుదల చేసింది.. అలాగే ఈ సినిమా 2 గంటల 2 నిమిషాల రన్ టైమ్ (Runtime) ఉందని తెలుస్తోంది.
ఉగ్రం సినిమాలో సెన్సార్ బోర్డు వాళ్ళు బాగానే కటింగ్ చేసినట్టు కూడా మూవీ టీం తెలియజేశారు. అల్లరి నరేష్ (Allari Naresh) మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా వస్తున్న ఈ ఉగ్రం మూవీ నీ కొంతమంది మీడియా వారికి చూపించటం జరిగింది. ఉగ్రం రివ్యూ (Ugram Review) ఎలా ఉంది అంటే, ఈ సినిమాలో అల్లరి నరేష్.. శివకుమార్ అనే పోలీస్ పాత్రలో నటించనున్నారు.
భార్య పిల్లలతో హ్యాపీగా గడుపుతున్న అల్లరి నరేష్.. తన డ్యూటీ కి సంబంధించిన కేసులో చిక్కుల్లో పడతాడు.. తన భార్య పిల్లలతో పాటు చాలామంది మిస్సింగ్ అవ్వడం వెనుక ఉన్న మిస్టరీని చేదించే క్రమంలో అల్లరి నరేష్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? చివరికి వారిని కాపాడా లేదా అనేది ఈ కథ సారాంశం అని చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ పర్ఫామెన్స్ అలాగే చూపించిన వేరియేషన్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది అని చిత్ర వర్గాల వారు చెప్తున్నారు. ఈ సినిమాతో ఆయన అల్లరి నరేష్ భారీ విజయం సాధించాలని ఆశిద్దాం..