Ugram Review In Telugu: అల్లరి మూవీతో మంచి కమెడియన్ గా తెలుగు తెరకు పరిచయమై తర్వాత నాంది సినిమాతో తన కెరీర్ లో ఓ వైవిధ్యమైన పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నరేష్. డైరెక్టర్ విజయ కనక మేడల తొలి ప్రయత్నంలో నాంది చిత్రం మంచి బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. ఇటు డైరెక్టర్ కి అటు యాక్టర్ కి ఇద్దరికీ ఈ చిత్రం మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు. దీంతో వీరిద్దరూ కలిసి చేస్తున్న ఉగ్రం (Ugram Movie) చిత్రం పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చిత్రం కచ్చితంగా హిట్ అని అందరూ అనుకున్నారు. మరి ఈరోజు విడుదలైన చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
Ugram Movie Review & Rating: 2.5/5
నటీనటులు : అల్లరి నరేష్, మిర్నా,మణికంఠ, కౌశిక్ మహత, ఇంద్రజ, శరత్ లోహితాశ్వ.
నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
దర్శకత్వం : విజయ్ కనకమేడల
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
విడుదల తేదీ : మే 5, 2023
Ugram Movie Review స్టోరీ : ఈ మూవీలో మెయిన్ గా హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా క్రైమ్ గురించి హైలెట్ చేయడం జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్ బాగా పెరగడంతో సిటీలో ఆడపిల్లలు మహిళలు పెద్ద మొత్తంలో మిస్ అవుతూ ఉంటారు. ఈ కేసును సాల్వ్ చేయడానికి నరేష్ ను సీఐగా నియమించడం జరుగుతుంది. అయితే అనూహ్యంగా ఈ మాఫియా వల్ల అతని కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది.
ఓ స్ట్రిక్ట్ గా ఉండే పోలీస్ ఆఫీసర్ శివ క్యారెక్టర్ లో నరేష్ కనిపించనున్నారు. మాదకద్రవ్యాలు తీసుకొని అమ్మాయిలను ఇబ్బంది పెట్టే వారిని అమ్మి వేయడానికి ప్రయత్నించిన గ్యాంగును శివ అరెస్టు చేస్తాడు. దీంతో ఆ గ్యాంగ్ శివ భార్య అయిన అపర్ణను (మిర్నా) ఇబ్బంది పెట్టడమే కాకుండా వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్తారు. ఈ క్రమంలో శివ చేతిలో ఆ గ్యాంగ్ లోని ముగ్గురు సభ్యులు చనిపోగా ఒక్కడు మాత్రం తప్పించుకుంటాడు.
తర్వాత కొన్ని రోజుల తర్వాత శివ కుటుంబం అనూహ్యంగా ఓ యాక్సిడెంట్ కు గురి అవుతుంది. యాక్సిడెంట్ నేపథ్యంలో శివ భార్య మరియు కూతురు మిస్ అవుతారు. అసలు వాళ్ళిద్దరూ ఏమయ్యారు? శివ వాళ్ల కోసం ఏం చేస్తాడు? కనిపించకుండా పోయిన నాలుగవ వ్యక్తి ఎవరు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
వివరణ: ఈ మూవీలో అసలు ట్విస్ట్ ఆక్సిడెంట్ సీను తర్వాత మొదలవుతుంది. మొదట 20 నిమిషాలు సినిమాలో ఏం జరుగుతుందో అర్థం కాదు, అసలు సినిమా ఏంటా అనే డౌటు కలిగే టైం లో డైరెక్టర్ ట్విస్టు తర్వాత ట్విస్ట్ విప్పుతూ వస్తాడు. అలాగే ప్రేక్షకులలో కూడా చిత్రం పట్ల క్రమంగా ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఖచ్చితంగా మూవీకి హై పాయింట్ అని చెప్పవచ్చు.
స్టార్టింగ్ యాక్సిడెంట్ సీతో మొదలవడం కాస్త ఉత్కంఠతను క్రియేట్ చేస్తుంది. అయితే మీరు నా మీనంతో నరేష్ లవ్ ట్రాక్ పరమ బోరింగ్ గా సాగుతుంది. నిజానికి అసలైన స్టోరీస్ సెకండ్ హాఫ్ లోనే మొదలవుతుంది. మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ మలుపులు తిరుగుతూ ఉత్కంఠ భరితంగా సాగే సీన్స్ బాగా ఎంగేజింగ్ గా ఉన్నాయి. క్లైమాక్స్ లో నిజంగా నరేష్ తన ఉగ్రరూపం చూపించాడు అని చెప్పవచ్చు.
మొదట్లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నరేష్ నాంది మూవీ తర్వాత సీరియస్ పాత్రలో కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు తిరిగి అదే సినిమా డైరెక్టర్ తో కలిసి ఉగ్రం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో నరేష్ డిఫరెంట్ క్యారెక్టర్ పోషించారు. నిజంగా చెప్పాలంటే నరేష్ ఇంత సీరియస్ గా కూడా నటించగలడా అన్న డౌట్ కలగక మానదు.
అంతా బాగుంది కానీ మొత్తం మీద సినిమాలో ఏదో తగ్గింది అన్న ఫీలింగ్ మాత్రం ఉంది. సినిమాటిక్ లిబర్టీ వల్ల అక్కడక్కడ ఆడ్ చేసిన సీన్స్ వాస్తవానికి కాస్త దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మూవీ ఓ మంచి కాన్సెప్ట్ మీద తీశారు కానీ అమ్మాయిలపై జరిగే సమస్యలను ప్రేక్షకులకు చూపించే విధానం మరీ డ్రమాటిక్ గా ఉంది. మూవీలో ఉన్న ఎమోషన్ కి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోతున్నారు.
ప్లస్ పాయింట్స్:
- అల్లరి నరేష్ నటన ఈ చిత్రానికి అత్యంత ప్లస్ పాయింట్.
- మూవీలో నిర్మాణ విలువలను కూడా ఎంతో మెరుగుగా పాటించారు.
- స్టోరీ లైన్ కూడా మూవీకి చాలా పవర్ ఫుల్ గా ఉంది అని చెప్పవచ్చు.
- ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సీన్స్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్తాయి.
- సెకండ్ హాఫ్ లో మిస్టరీలు ,ట్విస్టులు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి.
మైనస్ పాయింట్స్:
- కొన్ని ఎమోషనల్ సీన్స్ అంత బాగా కనెక్ట్ కాలేదు.
- హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ నిజంగా మూవీలో అనవసరం అన్న ఫీలింగ్ కలిగిస్తుంది.
- కొన్ని చోట్ల కథ బాగా సాగదీసినట్లుగా ఉంది.
- స్లో నరేష్ మరియు కథకు మధ్యలో అడ్డం వచ్చేలా పాటలను ఇరికించడం బోరింగ్ గా ఉంది.
ట్యాగ్ లైన్ : పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినప్పటికీ ఓ మంచి సస్పెన్స్ డ్రామాగా చూడాలి అనుకుంటే ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడవచ్చు. సినిమా ఎలా ఉన్నా అల్లరి నరేష్ నటన మాత్రం అద్భుతంగా ఉంది. అల్లరి నరేష్ పర్ఫామెన్స్ కోసమైనా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.