Anushka first look in Sye Raa Pre Release Event
Anushka first look in Sye Raa Pre Release Event

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా మొత్తంలో మెగాస్టార్ పాత్ర తరువాత మరో పాత్రకి కూడా ప్రత్యేకమైన గుర్తింపు వస్తోందట. ఆ పాత్రలోనే అనుష్క నటించిందట. అయితే మొదట ఈ సినిమాలో అనుష్క పాత్ర స్టోరీ టెల్లర్ గా ఉంటుందని వార్తలు వినిపించాయి. కానీ అనుష్క సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్కకు సంబంధించిన లుక్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.