ఉపాసన కి సపోర్ట్ గా సమంత కొత్త అవతారం..!

0
636
upasana announces samantha akkineni guest editor for urlife website

Samantha Akkineni: Uppasana Konidela: ఉపాసన ప్రయత్నానికి సమంత తోడైంది. ఉపాసన ప్రారంభించిన URLife.co.in అనే వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా సమంత వ్యవహరించనుంది. సమంత గురించి ఇపుడు సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని ఇంటి కోడలైన తర్వాత కూడా హీరోయిన్‌గా సమంత దూకుడు మాములుగా లేదు. పెళ్లి తర్వాత సమంత కెరీర్ మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్టుగా సాగుతోంది.

Samantha Akkineni as guest editor urlife co in says upasana konidela

టాలీవుడ్ టాప్ స్టార్స్ కోడళ్ళు ఉపాసన, సమంత. సినిమాల్లో నటిస్తూనే సమంత సత్తా చాటుతుండగా, అపోలో హాస్పిటల్ బాధ్యతలు మోస్తూనే టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ ఆరోగ్య చిట్కాలు అందిస్తోంది ఉపాసన. ఈ నేపథ్యంతో తాజాగా ఉపాసన ప్రయత్నానికి సమంత తోడైంది. ఉపాసన ప్రారంభించిన URLife.co.in అనే వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా సమంత వ్యవహరించబోతోంది.

అంతేకాదు ఈ వెబ్‌సైట్‌లో ఆరోగ్య పరిరకణకు సంబంధించిన చిట్కాలు, ఆరోగ్య సూత్రాలను, ఆహార నియమాలకు సంబంధించిన నిపుణులైన వైద్య నిపుణుల సలహాలను ఈ వెబ్‌సైట్ ద్వారా అందించబోతున్నారు. యువర్ లైఫ్ వెబ్‌సైట్‌కు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మేనేజింగ్ డైరెక్టర్‌గా ఈ వెబ్ సైట్‌ను ప్రారంభించారు. సమంతతో కలిసి ప్రజలకు ఆరోగ్య చిట్కాలను దీని ద్వారా అందించనున్నారు.

”సమంత కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ రక్షణని ప్రోత్సహిస్తున్నారు. పూర్తి శాకాహారపు జీవనాన్ని అనుసరిస్తూ ఫిట్‌నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సో.. URLife.co.in వెబ్ సైట్ ద్వారా ఆమె నైపుణ్యం మరింత మందికి చేరువ అవుతుందని ఆకాంక్షిస్తున్నాం” అని తెలిపింది ఉపాసన.

Previous articleరష్మి గౌతమ్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా.. ?
Next articleసమంత క్రేజీ రియాక్షన్ అనుష్క బేబీ బంప్..!