నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు హిజ్రా.. ఉపాసన ఓపెన్ కామెంట్

0
354
upasana kamineni reveals her best friend is a transgender

Upasana Kamineni: మెగా కోడలు ఉపాసన ఓపెన్ మైండెడ్ బోల్డ్ అన్న సంగతి తెలిసిందే. స్వతాహాగా సామాజిక స్పృహతో పలు పోస్టులు పెట్టే ఆమె.. తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది. అపోలో సంస్థానాధీశుడి వారసురాలు అయినా, రామ్ చరణ్ భార్య అయినా కానీ.. ఆ రేంజ్ హంగామా హడావుడి కూడా తన వద్ద చూడలేం. సమాజానికి ఉపయోగకరమైన ఎలాంటి విషయాన్నైనా ఓపెన్‌గా చెప్పేయడం ఉపాసన నైజం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన షాకింగ్ విషయం చెప్పడం అభిమానుల్లో చర్చకు తావిచ్చింది. తన బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఇప్పుడు హిజ్రా (ట్రాన్స్ జెండర్) అన్న విషయాన్ని ఉపాసన బహిరంగంగా చెప్పారు. తనంటే గౌరవం అని తెలిపారు. అలాగే ప్రతి ఇంట్లో మహిళల్ని గౌరవించాలని .. గౌరవించలేని వారు ఇంట్ల దేవీ మాతల ఫోటోలు పెట్టుకోకూడదని ప్రార్థనలు చేయొద్దని ఉపాసన అన్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా ఉపాసన చెప్పిన ఈ విషయాలను అంతా స్వాగతిస్తుండటం విశేషం.