upasana reads samantha article and expressed her feelings

Samantha: Upasana: అందం ఆరోగ్యం ఫిట్నెస్.. ఇలా లైఫ్ స్టైల్ కి సంబంధించిన అన్ని విభాగాలపైనా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం URlife వేదికను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత రాసిన ఆర్టికల్ చదువుతూ ఆమెపై కామెంట్స్ చేసింది ఉపాసన.

ఇటీవల సామ్ – ఉపాసన జోడీ వీడియో చిట్ చాట్ లతో ఎన్నో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తాజాగా ప్లాంట్ ఫుడ్ పై సమంత ఆసక్తికర కథనం రాసారు. అలాగే తాను మొక్కల పెంపకం దానిని నుంచి ఆహారం తయారు చేసుకోవడం అనే టాపిక్ ని సమంత వివరించారు. అలాగే కొన్ని క్యారెట్ మొక్కల్ని చేతపట్టి సామ్ ఇచ్చిన ఫోజు తాజాగా మరోసారి వైరల్ అవుతోంది. ఇక ఈ స్టార్ కోడళ్ల స్నేహబంధం గురించి మనందరికీ తెలుసు. అయితే తాజాగా సమంత ఆర్టికల్ చదువుతూ గిల్టీగా ఫీల్ అవుతున్నానని చెప్పి ఆశ్చర్యపరిచింది ఉపాసన.

”రియాలిటీ! సమంత రాసిన ఆర్టికల్ చదువుతున్నాను. మొక్కల నుంచి పౌష్టికాహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి? అనే అంశంపై URlife వెబ్ సైట్‌లో సమంత పేర్కొంది. ఇదో నరకంలా భావిస్తున్నా. నా విషయంలో ఆరోగ్యకరమైన జీవన విధానం ఒక జర్నీలాంటిది తప్ప రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పని కాదు. వెజిటేరియన్‌గా మారి మొక్కల ఆధారిత ఆహారం గురించి ఆమె చెబుతున్న విధానం ఎంతో స్ఫూర్తినిస్తోంది. ఏదో ఒక రోజు ఆ స్థాయికి చేరుకుంటాను” అని ఉపాసన పేర్కొంది.

అయితే దానికి సమంత రిప్లయ్ ఇస్తూ.. “మీరు చాలా అందంగా ఉన్నారు“ అన్న శీర్షికను ఇవ్వడం ఆసక్తికరం. ఒక రకంగా సమంతలా ప్లాంట్ డైట్ వంటి ఇన్నోవేషన్ ని తాను అనుసరించలేకపోవడాన్ని ఉపాసన గిల్టీ ఫీలవుతున్నారు మరి.