వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమాలు ఇవే

1664
upcoming-tollywood-summer-release-movies-list-2021
upcoming-tollywood-summer-release-movies-list-2021

షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలెన్నో కరోనా లాక్ డౌన్ కారణంగా రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. సంక్రాంతి సీజన్ వస్తుండటంతో కచ్చితంగా మునపటి రోజులు వస్తాయని నమ్మకంగా ఎదురుచూసిన దర్శక నిర్మాతలకు, ప్రేక్షకులకు 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయంతో నిరాశ ఎదురైంది. సంక్రాంతికి రావాల్సిన సినిమాలు సైతం వేసవి కాలానికి వెళ్లాయి. సమ్మర్‌ లో ఖచ్చితంగా థియేటర్లకు పూర్తిగా గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు.

 

 

 

ఇక ఇప్పుడు స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో పోటీ ప‌డేందుకు ప‌లు సినిమాలు సిద్ధ‌మయ్యాయి. దాదాపు డ‌జ‌నుకి పైగా సినిమాలు వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’, నాని ‘టక్ జగదీష్’, నితిన్ ‘రంగ్ దే’, చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్ ‘నారప్ప’, రానా దగ్గుబాటి ‘అరణ్య’ ‘విరాటపర్వం’, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, గోపీచంద్ ‘సీటిమార్’, పూరి-విజయ్ ‘ఫైటర్’, ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’, అఖిల్ ‘బ్యాచిలర్’, అల్లు అర్జున్-సుకుమార్‌ల ‘పుష్ప’ శర్వానంద్ ‘శ్రీకారం’ ఇలా బోలెడు సినిమాలు సమ్మర్ ను టార్గెట్ చేస్తున్నాయి. మొత్తానికి వేసవిలో భారీ చిత్రాల మోత మోగడం.. ప్రేక్షకులు ఈ వినోదంలో ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయంగా కనిపిస్తోంది.