విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అలాగే సమంత (Samantha) కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ ఖుషి (Kushi Movie). శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు మేకర్స్.. నా రోజా నువ్వే మొదటి పాటతో సినిమాపై మరింత అంచనాలు పెంచారు మేకర్స్. ప్రస్తుతం ఖుషి సినిమాకు సంబంధించిన షూటింగు కేరళలో జరుగుతుంది. రొమాంటిక్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ (Climax) అద్భుతంగా ఉంటుంది అని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.
సమంత అలాగే విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుండే భారీ అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదో ఒక న్యూస్ తో సోషల్ మీడియాలోనూ అలాగే ఫిలింనగర్లో వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం చూస్తే క్లైమాక్స్ విజయ్ – సమంతా ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ తట్టుకోలేరంటున్నారు.
అసలు విషయానికి వస్తే, ఫిలింనగర్ లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం, ఖుషి సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్లలో మధ్య వచ్చిన సన్నివేశాలలో ఒక పాత్ర అనేది చనిపోతుందంట.. అంతేకాకుండా ఖుషి సినిమా మొత్తం మొదటి దగ్గర నుంచే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ‘చావు ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ ఖుషిగా బ్రతకాలి’ అనే మెసేజ్ తో ఈ సినిమాని ముగిస్తారు అంట.
అలాగే చివరి 30 నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్ గా సాగుతుందని.. దర్శకుడు ఈ ఎమోషనల్ సీన్స్ తో థియేటర్లో కూర్చున్న వారంతా వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్తారు అంటూ లీకైన దానిని బట్టి అర్థమవుతుంది. ఇద్దరి ఫ్యాన్స్ అయితే అస్సలు జీర్ణించుకోలేరనే చెప్పాలి. మరి ఇలాంటి క్రిటికల్ పాయింట్ని దర్శకుడు ఏ విధంగా చూపించబోతున్నాడు అనే విషయం మీద ఇప్పుడు చర్చి నడుస్తుంది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన వస్తుంది.
Web Title: Update on Vijay Devarakonda Kushi climax Scene, Kushi release date, Samanth, Vijay Devarakonda, Kushi movie, kushi shooting update, Kushi Climax, Kushi movie songs