Allu Arjun Upcoming movie with Sandeep Reddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడితో సినిమా ఖరారు కావడంతో అల్లు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Allu Arjun Upcoming movie with Sandeep Reddy: అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ‘ప్రకటన ఇవ్వగానే పండుగ కాదు.. ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో ఇప్పుడప్పుడే చెప్పలేం’ అనే కామెంట్స్ చేస్తున్నారు. గతంలో జరిగిన అనౌన్స్ మెంట్స్ ను ఇక్కడ ఉదహరిస్తున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) మాట మీద నిలబడడని.. డైరక్టర్ హిట్టు కొడితేనే తన ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని వ్యాఖ్యానిస్తున్నారు.
బన్నీ ట్రాక్ రికార్డును గమనిస్తే, ఈ కామెంట్స్ లో అంతో ఇంతో నిజం ఉందేమో అనిపిస్తుంది. స్టైలిష్ స్టార్ గతంలో లింగుస్వామి దర్శకత్వంలో ఓ తెలుగు తమిళ ద్విభాషా చిత్రాన్ని ప్రకటించారు. స్టూడియో గ్రీన్ వారితో కలసి చెన్నైలో గ్రాండ్ గా లాంచ్ చేశారు అల్లు అరవింద్. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఊసే లేదు.
అలానే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్ – కనబడుట లేదు’ అనే సినిమాని ప్రకటించారు అల్లు అర్జున్ (Allu Arjun). అల వైకుంఠపురములో, పుష్ప చిత్రాలను పూర్తి చేశారు కానీ.. ఈ ప్రాజెక్ట్ ని మాత్రం పట్టలెక్కించలేదు. ‘వకీల్ సాబ్’ తర్వాత ఐకాన్ ను షురూ చెయ్యాలని దిల్ రాజు చాలా ప్రయత్నాలు చేశారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు ఆ స్క్రిప్టు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు హీరో నితిన్ వద్ద ఆగిందని సమాచారం.
కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా AA21 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ మెంట్ వచ్చింది. కారణాలు ఏవైనా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు. ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ అందుకున్న కొరటాల.. NTR30 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొడితే, బన్నీ సినిమా ఉండే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మురగదాస్ తో మూవీ ఉండొచ్చని అప్పట్లో సన్నిహిత వర్గాలు హింట్ ఇచ్చాయి.
‘రేసుగుర్రం’ తర్వాత డైరక్టర్ బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మరో సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్లు అరవింద్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు కూడా. కానీ ఇది ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. విక్రమ్ కె కుమార్, పరశురామ్ లతో కూడా బన్నీ కథా చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
టాలీవుడ్ లో హిట్టిచ్చిన దర్శకులకు అడ్వాన్సులు ఇవ్వటం.. కథ రెడీ చేసుకొని రమ్మని చెప్పడం మామూలే. అల్లు అర్జున్ కూడా దీనికి మినహాయింపు కాదు. కాకపోతే అనౌన్స్ మెంట్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ సైతం వెనక్కి పోవడంతో బన్నీ మాట మీద నిలబడరనే నెగెటివ్ కామెంట్స్ చేయడానికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ‘యానిమల్’ సినిమా హిట్టైతెనే సందీప్ రెడ్డి వంగాతో ఐకాన్ స్టార్ సినిమా ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.