Homeట్రెండింగ్KGF కి దీటుగా ఉపేంద్ర "కబ్జా" టీజర్ విడుదల

KGF కి దీటుగా ఉపేంద్ర “కబ్జా” టీజర్ విడుదల

ఉపేంద్ర కీ మన తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. డిఫరెంట్ పత్రాలు చేస్తూ తెలుగులో ఎన్నో మంచి చిత్రాల్లో నటించాడు ఉపేంద్ర. ఈరోజు ఉపేంద్ర కొత్త సినిమా ఆయన కబ్జా టీజర్ (KABZA Teaser) నీ విడుదల చేశారు మేకర్స్.

ఉపేంద్ర కబ్జా టీజర్ (KABZAA Teaser) గమనిస్తే, యాక్షన్ సన్నివేశాలతో పాటు మదర్ సెంటిమెంట్ కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. ఒకరకంగా కేజిఎఫ్ సినిమా కి దీటుగా చిత్రీకరణ చేసినట్టు తెలుస్తుంది. టీచర్ మొత్తం రఫ్ లుక్ లో ఉపేంద్ర కనపడతాడు. అలాగే ‘కేజీఎఫ్’కు ప్రాణంగా నిలిచిని రవి బాస్రూర్ నేపథ్య సంగీతం ‘కబ్జ’కు కూడా అదే ఫీల్ ని కలిగిస్తూ ప్రధాన హైలైట్ గా నిలుస్తోంది.

కేజిఎఫ్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు కన్నడ హీరోలు సైతం పాన్ ఇండియా లెవల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. రియల్ స్టార్ గా కన్నడ నాట పేరు తెచ్చుకున్న ఉపేంద్ర ఇందులో హీరోగా నటించాడు. శ్రియ హీరోయిన్ఆ. ర్. చంద్రు దర్శకత్వం వహించిన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో కన్నడతో కలిసి ఏడు భాషల్లో విడుదల చేయబోతున్నారు.

1942 సమయంలో ఓ ఇండియన్ గ్యాంగ్ స్టర్ ప్రయాణమే ‘కబ్జా’ స్టోరీ. ఈ టీజర్ లోని ప్రతి సీను, ప్రతీ షాట్ చూస్తుంటే కేజీఎఫ్ చిత్రమే కళ్లముందు మెదలాడుతోంది. ఈ సినిమా డైరెక్టర్ ఆర్.చంద్రు కూడా.. కేజీఎఫ్ నుంచి స్పూర్తి పొందినట్లు కనిపిస్తోంది.

అయితే విజువల్స్ మాత్రం కేజీఎఫ్ కి ఏ మాత్రం తీసిపోకుండా చిత్రీకరణ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. మరి కొన్ని రోజులు ఆగితే కానీ ఎప్పుడు అనేది తెలియదు. టీచర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.

- Advertisement -

 

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY