ట్రెండ్ అవుతున్న’జల జల జలపాతం’ వీడియో సాంగ్

1072
Uppena​ - Jala Jala Jalapaatham Full Video Song | Panja Vaisshnav Tej,Krithi Shetty| Buchi Babu| DSP
Uppena​ - Jala Jala Jalapaatham Full Video Song | Panja Vaisshnav Tej,Krithi Shetty| Buchi Babu| DSP

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, క్యూట్ గర్ల్ కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాక వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

 

ఇక దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా గురువారం జల జల జలపాతం ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. అల విడుదలైందో.. లేదో ఇలా ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించగా.. శ్రేయాఘోషల్, జాస్ ప్రీత్ జాజ్ అద్బుతంగా ఆలపించారు. ఇక ఈ పాట యూత్‏ను విపరీతంగా ఆకట్టుకుంది.