నాని స్టోరీతో వైష్ణవ్ తేజ్ న్యూ మూవీ స్టార్ట్

1497
Uppena actor Vaishnav Tej Up coming movie update

ఉప్పెన సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్న వైష్ణవ్‌ వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే డైరెక్టర్‌ క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘జంగిల్‌ బుక్’ సినిమాను పూర్తి చేశాడు. అనంతరం అన్నపూర్ణ బ్యానర్‌లో ఓ చిత్రం.. ఇపుడు ఇంకో సినిమా కి ఒకే చెప్పాడు అంట వైష్ణవ్ తేజ్..

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఓకే చేశాడు. అది హీరో నాని చేస్తే బాగుంటుందని భావించి వెళ్లి అతనికి కథ చెప్పమన్నాడు. కానీ.. ఆ స్టోరీ విన్న నాని రిజెక్ట్ చేశాడు. దాంతో ఈ స్టోరిని ఉప్పెన హీరో వైష్ణవ్‌ తేజ్కు వినిపించారట సదరు దర్శకుడు. వైష్ణవ్ ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

నాని ఏ కారణాల వల్ల నో చెప్పాడో తెలియదుగానీ.. వైష్ణవ్ తేజ్ మాత్రం ఈ స్టోరీకి ఇంప్రెస్ అయ్యాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్కి వెళ్లనుంది. అలాగే ప్రస్తుతం ఓ హీరో స్లోరిని రిజెక్ట్‌ చేస్తే దాన్ని.. పక్కన పడేయడం లేదు. మరో హీరోకు ఆ స్టోరిని వినిపించి, సినిమాను పట్టాలెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే నాచురల్ స్టార్ వదులుకున్న ఈ చిత్రం మెగా హీరోకి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.