ఉప్పెన మొదటి హీరో విజయ్ దేవరకొండ అంట ?

0
192
uppena-director-about-first-hero
uppena-director-about-first-herouppena-director-about-first-hero

ఉప్పెన ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల విడుదలై థియేటర్లలో కాసుల ఉప్పెన తెప్పించిన సినిమా. ఈ సినిమా ద్వారా హీరో,హీరోయిన్‌లు వెండి తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాను బుచ్చి బాబు డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో సినిమా గురించి అనేక విషయాలను దర్శకుడు తెలిపారు. ఈ సినిమా కథ చాలా బాగుంటుందని, సినిమా చూసిన వారు  భావోద్వేగాల ఉప్పెనకు గురవుతారని అన్నారు. అంతేకాకుండా మొదట కథ రాసుకునేటప్పుడు పలానా హీరో అనుకోలేదని, ఆ తరువాత ఈ హీరో బాగుంటాడు అన్న ఆలోచన చేశానని చెప్పారు.

 

 

అయితే ఈ సినిమాకు మొదటగా రౌడీ హీరో విజయ్ దేవరకొండను అనుకున్నారంట, కానీ ఆ తరవాత వైష్ణవ్ తేజ్‌ను ఓకే చేశారంట. మొదట వైష్ణవ్‌ను చూసినప్పుడు అతడి కళ్లు బాగా నచ్చాయని, అతడైతే ఇంకా బాగుంటుందని అనుకున్నారంట. తన కథలోని హీరో పాత్రకి వైష్ణవ్ సరిగ్గా సరిపోతాడని అనిపిచిందని అన్నారు. అయితే విజయ్‌ను ఎందుకు కమిట్ అవ్వలేదన్న దానిపై కూడా బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. విజయ్ రేంజ్ ఇప్పుడు చాలా పెరిగింది. ఈ స్థాయిలో ఉన్నప్పుడు అతడి అంచనాలకు ఈ కథ సరిపోదని అనిపించిందని, అందుకనే విజయ్‌ని కమిట్ అవ్వలేదని అన్నారు.